25.2 C
Hyderabad
January 21, 2025 10: 15 AM
Slider సంపాదకీయం

నేడు బీసీలకు ప్రాధాన్యం… నాడు రెడ్లకే అందలం

#jaganreddy

అందరూ రెడ్డి కులస్తులనే పెట్టుకుని ఐదేళ్ల రాజ్యాధికారాన్ని యథేచ్ఛగా అనుభవించిన జగన్ రెడ్డి పాలనకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవర్తిస్తున్నారు. అర్హత ప్రాతిపదికగా నామినేటెడ్ పదవుల నుంచి అన్ని రకాల పదవులు ఇస్తున్న చంద్రబాబు పాలనను అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి, బీసీ కులానికి చెందిన కె.విజయానంద్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో ఆనాడు జగన్ రెడ్డి చేసిన పనులన్నీ గుర్తుకు వస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తన కులం వాడిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోవడానికి 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను జగన్ రెడ్డి పక్కకు తోశారు. ఇది అన్యాయం అని ఎవరు చెప్పినా కూడా జగన్ రెడ్డి వినిపించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను కూడా కుల దురహంకారంతో జగన్ రెడ్డి పక్కకు తోశాడు. తనకు అత్యంత సన్నిహితుడైన ఒక జూనియర్ ఐఏఎస్ అధికారి తో అవమానం చేయించి మరీ బ్రాహ్మణుడైన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను చీఫ్ సెక్రటరీ పదవి నుంచి వెళ్లగొట్టిన విషయాన్ని తాజా గా అందరూ గుర్తు చేసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బిసి అధికారి కె.విజయానంద్ కు అవకాశం ఇవ్వడం అంటే చంద్రబాబు అర్హత తప్ప కులం చూడరు అనే విషయాన్ని మరో మారు రుజువు చేసిందని అంటున్నారు. చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డిని, దాదాపు 14 మంది సీనియర్ ఐపిఎస్ లను పక్కకు తప్పించి డీజీపీగా తన కులానికి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని తెచ్చుకోవడం జగన్ రెడ్డి కుల పక్షపాతాన్ని రుజువు చేసింది. అదే కాకుండా అన్ని అధికారిక, నామినేటెడ్ పదవుల్లో కూడా రెడ్డి కులస్తులనే నియమించుకున్న జగన్ రెడ్డి పాలనను ఛిద్రం చేశారు.

రెడ్డి కులస్తులను లేదా క్రైస్తవులను మాత్రమే జగన్ రెడ్డి కీలక పదవుల్లో ఉంచుకున్నారనే విషయం ఎవరు దాచిదా దాగని సత్యం. చివరకు పార్టీ పదవులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వై వి సుబ్బారెడ్డి లకే కట్టబెట్టారు. ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయ సాయిరెడ్డిని తీసేస్తే మళ్లీ తన కులానికే చెందిన వై వి సుబ్బారెడ్డికి ఆ పదవి ఇచ్చిన జగన్ రెడ్డి కులతంత్రాన్ని అప్పటిలోనే చాలా మంది విమర్శించారు. అయితే జగన్ రెడ్డి ఇవేవీ పట్టించుకోకపోగా తన కులం తన మతం వారికే ప్రాధాన్యతనిచ్చారు. ప్రశ్నించిన వారిని దారుణంగా హింసించారు.

దాంతో ఆయన తన కులంగా చెప్పుకునే రెడ్డి కులస్తులు, తన మతంగా చెప్పుకునే క్రైస్తవులు కూడా జగన్ రెడ్డికి దూరం జరిగారు. రెడ్డి లేదా క్రైస్తవులలో కూడా తనకు కావాల్సిన వారినే, తన దోపిడికి సహకరించిన వారినే జగన్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారని అప్పటిలోనే చాలా మంది అన్నారు. అలాంటి పాలన నుంచి విముక్తి కోరుకున్న ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు పాలన ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు పెద్ద పీట వేస్తున్నారు. ఉమ్మడి ఎపి లో గాని, నవ్యాంధ్ర లో గాని ఇప్పటి వరకు బీసీలకు చీఫ్ సెక్రటరీ పోస్టు దక్కలేదు.

తొలి సారి బీసీ అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా చంద్రబాబు అవకాశం కల్పించారు. అదే విధంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన టీటీడీ ఈవో గా బీసీ అధికారి శ్యామల రావును ఇప్పటికే నియమించారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావుకూడా బిసినే. చంద్రబాబు పాలనలో అటు ప్రభుత్వంలోను,పార్టీలోనూ బీసీలకు చంద్రబాబు సముచిత స్థానం కల్పించారని అంటున్నారు. ఇప్పటికే తెలుగు దేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా బీసీ నేత పల్లా శ్రీనివాస్  ఉన్నారు. శాసన సభ స్పీకర్ గా మరో సీనియర్ నేత చింతకాలయ అయ్యన్న పాత్రుడుకు అవకాశం కల్పించారు.

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

అట్టహాసంగా మొదలు కానున్న తెలంగాణ కుంభమేళా

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగలేదు

Satyam NEWS

అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకుంటున్న సిఎంఆర్ఎఫ్

Satyam NEWS

Leave a Comment