28.7 C
Hyderabad
April 17, 2024 04: 18 AM
Slider గుంటూరు

ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లిస్తున్న జగన్ సర్కార్

#navataramparty

ఎస్సిలకు అమ్మఒడి పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసారని, స్కాలర్ షిప్ హక్కు హరించారని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ పరం చేస్తుంటే వైస్సార్సీపీ ఎంపీలు మౌనవ్రతం చేస్తున్నారని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు. విజయవాడలో హొటల్ ఐలాపురం శ్రీరామ్ హాల్ లో ఏపీజేఎఫ్ అధ్యక్షులు చెవుల కృష్ణఅంజనేయులు అధ్యక్షత వహించిన  సమావేశంలో నేడు ఆయన పాల్గొని ప్రసంగించారు.

జైభీం జస్టిస్ యాక్సెస్ సంస్థ అధ్యక్షులు, మాజీ న్యాయమూర్తి  జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లింపు రాష్ట్ర బడ్జెట్ గురించి జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. బహుజన అసెంబ్లీ నిర్వహించాలని,సభ్యులు గా  తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొరివి వినయ్ కుమార్ కొనసాగాలని సమావేశంలో నిర్ణయించారు.

2023తో ఎస్సి సబ్ ప్లాన్ గడువు ముగియడంతో దానిని కొనసాగించేలా ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు  పనిచేయాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. గుంటూరు లో బహుజన ప్రజా చైతన్య వేదిక అధ్యక్షులు దొంతా సురేష్ హిందు కాలేజ్ సెంటర్, మహాత్మా పూలే విగ్రహం వద్ద విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయొద్దని 12.02.2022 చేపట్టిన దీక్షలో నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి వి గణేష్,చిలకలూరిపేట కన్వీనర్ బత్తుల అనిల్,తెలుగుదేశం పార్టీ గుంటూరు తూర్పు ఇన్చార్జ్ నసీర్ అహ్మద్, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్,సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు,పాశం కృష్ణ, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోర్టు మెట్లు ఎక్కిన ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Satyam NEWS

అవినీతి అడ్డాగా మారిన తహసీల్దార్ కార్యాలయం

Satyam NEWS

రాయలసీమ ద్రోహి సీఎం జగన్‌

Bhavani

Leave a Comment