33.2 C
Hyderabad
April 26, 2024 00: 28 AM
Slider ప్రత్యేకం

కొత్త కార్పొరేషన్ చైర్మన్ లకు జగన్ ప్రభుత్వం షాక్

#JaganReddy

కొత్తగా కార్పొరేషన్ చైర్మన్ లు గా బాధ్యతలు తీసుకుని సంతోషంగా ఉన్న వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. కులానికో కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు ఇచ్చిన ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో కొత్త చైర్మన్ లు హతాశులైపోయారు.

అసలు విషయం ఏమిటంటే 2018 మే 22న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 74 ప్రకారం కార్పొరేషన్ చైర్మన్ లకు నెలకు రెండు లక్షల 12 వేల రూపాయలు జీతభత్యాల కింద వచ్చేది. అన్ని సంక్షేమ కార్పొరేషన్ల చైర్మన్ లకు ఈ నిబంధన వర్తించేది.

ఈ రెండు లక్షల 12 వేల రూపాయలలో వారి జీతాలు, భత్యాలు, ప్రయాణ ఖర్చులు లాంటి సౌకర్యాలు అన్నీ వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా లాభాపేక్షతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్ లకు చైర్మన్ లుగా ఉన్న వారికి 2 లక్షల 56 వేల 500 రూపాయలు వేతనం ఇచ్చేవారు.

అయితే లెక్కకు మించి పదవులు ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పదవులు ఇచ్చేసిన తర్వాత లెక్కలు వేసుకున్నట్లుంది. ఒక్క సారిగా గుండె గుభిల్లు మని అనిపించి ఉంటుంది.

దాంతో ఏకంగా సంక్షేమ కార్పొరేషన్ ల కు సంబంధించిన చైర్మన్ ల జీతం మొత్తం కలిపి 56 వేల రూపాయలకు కుదించింది. అలాగే లాభాపేక్ష ఉన్న కార్పొరేషన్ చైర్మన్ ల జీతాలు రూ.65 వేలకు తగ్గించేసింది. ఈ విధంగా నాలుగో వంతుకు జీతాలు కోత పెట్టడంతో కొత్త చైర్మన్ లకు చక్కలు కనిపించాయి.

అదే విధంగా సంక్షేమ కార్పొరేషన్ల డైరెక్టర్ల జీతాలు 12 వేలకు, లాభాపేక్ష ఉన్న కార్పొరేషన్ డైరెక్టర్ల జీతాలు 14 వేలకు కుదించారు. కొత్తగా పదవి వచ్చిన వారికి ఈ విధంగా షాక్ తగిలేలా ప్రభుత్వం చేసింది.

Related posts

తిరుపతి గంగమ్మ రాజకీయాల్లోకి వచ్చిందా?

Satyam NEWS

జగిత్యాల డిఎస్పి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్టు ప్రోగ్రాం

Satyam NEWS

హుజూర్ నగర్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment