Slider సంపాదకీయం

ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల గొంతుకు అవుతుందా?

#jagan

వై నాట్ 175 అని ఐదేళ్ల తన విధ్వంసకర పరిపాలనతో పేట్రేగిపోయిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదాలో కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదని ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించకుండా తన స్వార్ధ బుద్ధిని మరోసారి రుజువు చేశాడు. అసెంబ్లీకి వెళ్తున్నట్లు ఫోటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చిన జగన్ రెడ్డి అండ్ కో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కనీసం 10నిమిషాలు కూడా వినడానికి ఇష్టపడలేదు అంటే…ప్రజలకు జరుగుతున్న మంచిని తాను జీర్ణించుకోలేకపోతున్నాడని స్పష్టంగా రుజువు చేశాడు.

11 సీట్లు అతి కష్టం మీద గెలిచిన జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా ప్రతిపక్ష హోదా కావాలని అసెంబ్లీలో, కోర్టుల్లో చేసే హడావుడి చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుతున్నారు. చేతిలో 151 సీట్లు ఉండగా ప్రజల యోగక్షేమాలను గాలికొదిలేసిన గాలి పంకా పార్టీ అధినేత జగన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రజల ఆగ్రహ సునామీలో కొట్టుకుపోయి 11 సీట్లకు పరిమితమయ్యాం…ప్రజలు మనల్ని ఛీ కొట్టారు…ఛీదరించుకున్నారు…నువ్వు మాకు అక్కర్లేదు…కనీసం ప్రతిపక్ష హోదాలో కూడా నువ్వు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా నీకు లేదు…..అని స్పష్టమైన తీర్పు ఇచ్చారనే ఇంగిత జ్ఞానం జగన్ రెడ్డికి నేటికీ రాలేదంటే…ఎంత మూర్ఖుడో అర్థమవుతుంది.

తాను అధికారంలో ఉండగా కనీసం 10శాతం సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఉంటుందని చిలకపలుకులు పలికిన జగన్ రెడ్డి….నేడు 11 సీట్లు జేబులో వేసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కాకి అరుపులు అరవడం ప్రజాస్వామ్యాన్ని, ప్రజల దేవాలయం అసెంబ్లీని అగౌరవపర్చడం కాక మరొకటి కాదు…

ప్రజాస్వామ్యంపై ఉన్న గౌరవంతో భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ అటల్ బిహారీ వాజ్ పేయీ వంటి అగ్రనాయకులు ప్రజావాణిని చట్టసభల్లో వినిపించిన దాఖలాలు లేకపోలేదు. అంతేగాకుండా 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44స్థానాలే గెలిచింది. సభలో ప్రతిపక్ష హోదా కావాలంటే 55 సీట్లు కావాలి. ప్రతిపక్ష హోదా లేకున్నా రాహుల్ గాంధీ లోక్ సభకు హాజరై దేశ సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు.

ఏపీ అసెంబ్లీలో వెంకయ్యనాయుడు, జయపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య వంటి గొప్ప నేతలు ప్రజా సమస్యలను సమర్థవంతంగా సభ దృష్టికి తెచ్చిన పరిస్థితులు ఉన్నాయి. కానీ జగన్ రెడ్డి తన వితండవాదనతో ప్రతిపక్షం ఉంటేనే అసెంబ్లీలో మాట్లాడతానని అనడం తనను నమ్మిన ప్రజలను వంచన చేయడమే. తనతోపాటు తన పార్టీ సింబల్ మీద గెలిచిన మరో 10మంది వైసీపీ ఎమ్మెల్యేలను సైతం చట్టసభల్లో తమను నమ్ముకున్న ప్రజల సమస్యలపై మాట్లాడనీయకుండా వివక్షపూరితంగా అసెంబ్లీకి దూరం చేస్తున్నాడు.

ఇలాంటి ప్రజా ద్రోహి జగన్ రెడ్డికి ప్రజల గురించి నోరెత్తే నైతిక హక్కు లేదు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. వేర్వేరు ఘటనల్లో రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను అని చెప్పే జగన్ రెడ్డి…నేడు అసెంబ్లీలో తనకు వచ్చే అవకాశాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నాడు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్ రెడ్డి 2019-24 మధ్య ఆడిన డ్రామాలు ఇప్పుడు చెల్లడంలేదని తెలుసుకుని అసెంబ్లీలో తమ సభ్యత్వాలను కాపాడుకోవడం కోసం అటెండెన్సు వేసుకుని (60 రోజులు అసెంబ్లీకి వెళ్ళకపోతే అతని ఎమ్మెల్లే పదవి ఊడిపోతుంది అని), సభలో కాసేపు హడావుడి చేసి పారిపోయాడు. ఇలాంటి బాధ్యత లేని జగన్ రెడ్డి అండ్ కో ప్రజాక్షేత్రంలో పని చేయరు…వాళ్లకు ప్రజల గురించి మాట్లాడే అర్హత, హక్కు రెండూ లేవు అని గుర్తుపెట్టుకోవాలి.

Related posts

బీజేపీని గెలిపిస్తే ములుగులో పేపర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం

Satyam NEWS

ఏపీఎస్ఆర్టీసీ లో తగ్గిన సరుకుల రవాణా చార్జీలు

Satyam NEWS

నీకై వేచితినోయి…

Satyam NEWS

Leave a Comment