24.7 C
Hyderabad
July 18, 2024 08: 17 AM
Slider సంపాదకీయం

సమాచార శాఖను దోచుకున్న జగన్ రెడ్డి

#jagan

ప్రభుత్వానికి చెందిన ఆడియో వీడియో సిస్టమ్ లను దోచుకెళ్లి ఇంట్లో పెట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వాటిని తిరిగి ఇవ్వరా? ఆయన ఇవ్వకపోతే సమాచార శాఖ వెళ్లి తెచ్చుకోదా? ఈ ప్రశ్నలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇంతకాలం జగన్ రెడ్డి దగ్గర స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్ గా పని చేసిన ఆయన నమ్మిన బంటు విజ‌య‌కుమార్‌రెడ్డి త‌న బాస్‌కు వివిధ మార్గాల ద్వారా వంద‌ల కోట్లు దోచిపెట్టాడు.

సాక్షి పత్రికకు, టివీకి యాడ్ల రూపంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసి ఇచ్చాడు. అది చాల‌ద‌న్న‌ట్లు అప్ప‌ట్లో జ‌గ‌న్ ఇంటిలో ల‌క్ష‌లాది రూపాయిలు వెచ్చించి ఆడియో, వీడియా సిస్ట‌మ్స్‌, ఇత‌ర దృశ్య మాద్య‌మాల‌ను ఏర్పాటు చేయించారు. దీని కోసం లేపాక్షి సంస్థ ద్వారా దాదాపు రూ.70ల‌క్ష‌లు విడుద‌ల చేయించి, సిఎం కార్యాల‌యంలో ఆడియో, వీడియో, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులను ఏర్పాటు చేయించాడు.

ఇప్పుడు జగన్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. అయినా సరే త‌మ‌ కులానికి చెందిన జ‌గ‌న్ నుంచి ఏమి స్వాధీనం చేసుకుంటాములే..అనుకున్నారో..లేక‌..జ‌గ‌న్ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవులే..రాష్ట్రంలోనే అత్యంత పేద‌వాడు ఆయ‌నే క‌నుక, వీటిని ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల కోసం వినియోగించుకుంటారులే.. అనే భావ‌న‌తో వీటిని స్వాధీనం చేసుకోకుండా సమాచార శాఖ అధికారులు మీన‌మేషాలు లెక్కిస్తున్నారో అర్ధం కావడం లేదు.

జగన్ రెడ్డి మాజీ ముఖ్య‌మంత్రి అయినా..ఇంకా కొంత మంది అధికారులు ఆయ‌నను ముఖ్య‌మంత్రిగానే భావిస్తున్నారట‌. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా అధికారాలు వెల‌గబెట్టిన‌ప్పుడు ప్ర‌భుత్వ సొమ్మును ఇష్టారాజ్యంగా ఖ‌ర్చు చేసి ఏర్పాటు చేసుకున్న సౌక‌ర్యాల‌ను తొల‌గించ‌డానికి కొందరు అధికారులు ఇంకా మీన‌మేషాలు లెక్కిస్తున్నారు. ఇలా మీన మేషాలు లెక్కిస్తున్న‌వారిలో స‌మాచార‌శాఖ‌కు చెందిన అధికారులు ముందు వ‌రుస‌లో ఉన్నారు.

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ రాజీనామా చేసిన త‌రువాత ప్ర‌భుత్వానికి చెందిన వీటిని స‌మాచార‌శాఖ వెన‌క్కు తెచ్చుకోవాల్సి ఉంది. కానీ స‌మాచార‌శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించ‌లేదు. జ‌గ‌న్ మాజీ అయినా..ఇంకా ప్రభుత్వ వ‌స్తువులు వాడుకోవ‌డం ఏమిటి..? ఆయ‌న‌కు ఇంగితం లేదునుకుంటే.. స‌మాచార‌శాఖ అధికారులు ఏమి చేస్తున్నారు. ప్ర‌భుత్వ సొమ్మును వెనుక్కు తెచ్చుకోవాల్సిన బాధ్య‌త వీరికి లేదా…?   అయితే..జ‌గ‌న్ హ‌యాంలో అంతా తానై..జ‌గ‌న్‌కు సేవ‌చేసి, ఇష్టారాజ్యంగా అధికారాల‌ను వెల‌గ‌బెట్టిన స‌మాచార‌శాఖ ఐటి వింగ్‌కు చెందిన అధికారి దీనిపై ఇప్పుడు నోరెత్త‌డం లేదు.

ఒక‌వైపు అప్ప‌టి ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలో పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న ఫ‌ర్నిచ‌ర్ స్వాధీనం చేయ‌క‌పోవడంపై భారీ ఎత్తున ర‌చ్చ‌ జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లోనూ, స‌మాచార‌శాఖ‌ అధికారుల్లో తాము ఏర్పాటు చేసిన ఆడియో, వీడియో, ఇత‌ర దృశ్య‌ప్ర‌సార‌సాధానాల‌ను స్వాధీనం చేసుకోవాల‌న్న ధ్యాస లేదు. స‌మాచార‌శాఖ త‌రుపున ఏర్పాటు చేసిన వీటిని జ‌గ‌న్ నుంచి స్వాధీనం చేసుకుని, ఇత‌ర అవ‌స‌రాల‌కు వాడుకునే ప‌రిస్థితి ఉంది. కానీ స‌మాచార‌శాఖ‌లోని జ‌గ‌న్ భ‌క్తులు మాత్రం వాటి గురించి ఆలోచించ‌డం లేదు.

దీనిపై స‌మాచార‌శాఖ అధికారుల‌ను వివ‌ర‌ణ కోర‌గా..జ‌గ‌న్ ఇంటిలో ఆడియో, వీడియో ఇత‌ర దృశ్య‌మాద్య‌మాలు ఉన్న‌మాట వాస్త‌మేన‌ని, కానీ దీన్ని స్వాధీనం చేసుకోమ‌ని త‌మ‌ను జిఏడి అధికారులు కోర‌లేద‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి జిఏడి ఇప్ప‌టికే దీనిపై స్ప‌ష్ట‌మైన విధానాల‌ను విడుద‌ల చేసింది. మాజీముఖ్య‌మంత్రి, మాజీ మంత్రులు, ఇత‌ర అధికార ప‌ద‌వుల్లో ఉన్న‌వారి కార్యాల‌యాలను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తెచ్చుకోవాల‌ని ప్రభుత్వం మారిన వెంట‌నే ఆదేశాలు ఇచ్చింది. అయితే స‌మాచార‌శాఖ‌లో పెత్త‌నం చేస్తోన్న అధికారుల త‌ల‌కు ఇదెక్క‌లేదు.

స‌మాచార‌శాఖ క‌మీష‌న‌ర్‌కు అస‌లు ఆ సోయే లేదు…దిగువ‌స్థాయిలో పెత్త‌నం చేస్తోన్న వారికి జ‌గ‌న్ త‌మ కులం, మ‌తం వాడ‌నే భావ‌న‌తో నోరెత్త‌డం లేదు. మొత్తం మీద ల‌క్ష‌లాది రూపాయ‌ల ప్ర‌జ‌ల సొమ్మును తిరిగి తీసుకురావాల‌న్న ధ్యాస స‌మాచార‌శాఖ అధికారుల‌కు కొద్దిగానైనా లేదు. ఇప్ప‌టికైనా స‌మాచార‌శాఖ అధికారులు జ‌గ‌న్ ఇంటిలో ఉన్న ల‌క్ష‌లాది రూపాయ‌ల డిజిట‌ల్ వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకోవాల్సి ఉంది.

Related posts

సమ్మె వీడి, విధుల్లో చేరండి..మంత్రి హరీశ్ రావు

Bhavani

జై భీమ్ సినిమా: చిత్తూరు జిల్లాలో ఎస్సీ మహిళపై పోలీసు క్రౌర్యం

Satyam NEWS

వేడుకగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

Satyam NEWS

Leave a Comment