31.2 C
Hyderabad
April 19, 2024 06: 42 AM
Slider కృష్ణ

పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ దిగిపోవాలి

#baburajendraprasad

పెట్రోల్, డీజిల్ పై అధికంగా వసూళ్లు చేస్తూ  పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు  ఉయ్యూరు టౌన్, మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని పెట్రోలు బంకుల దగ్గర   ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు.

ఈ సందర్బంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ రేట్ల వలన రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి  ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, ఈ రేట్ల పెరుగుదల వలన ట్రాన్స్పైర్ట్ చార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు రాష్ట్రంలో పెట్రోల్ రేట్లు బాదుడే బాదుడు అని చెప్పిన జగన్ రెడ్డి  ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత దానికి రెండింతలు బాదటం రాష్ట్ర ప్రజల్ని మోసం చెయ్యడం కాదా అని ఆయన ప్రశ్నించారు.

ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ నిన్న ప్రెస్ మీట్లో ఆంధ్రలో రోడ్డు టాక్స్ రూపంలో పెట్రోల్ రేట్లు ఎక్కువ అమ్ముతున్నారని చెప్పినా కూడా జగన్ రెడ్డి కి, వైసీపీ నాయకులకు   అవమానంగా లేదా అని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, డీజిల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ రెట్లకు అమ్ముతూ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ప్రభుత్వం 26 వేల కోట్ల రూపాయలు అధికంగా ప్రజలపై భారం మోపిందని రాజేంద్రప్రసాద్ తెలిపారు.

ఆటో వాళ్ళకి 10 వేలు ఒకచేత్తో ఇచ్చినట్లే ఇచ్చి రెండు చేత్తో డీజిల్ పెంపు రూపంలో, కేసుల రూపంలో వసూళ్లు చేస్తూ వారి పొట్ట కొడుతున్నారని , ఒక పెట్రోల్, డీజిల్ విషయంలోనే కాకుండా వంట గ్యాస్ , మద్యం, ఇసుక ఇలా అనేక రకాలుగా రేట్లు పెంచి పేద వారి బతుకులతో చెలగాటం ఆడుతున్న జగన్ ప్రభుత్వాన్ని త్వరగా రాష్ట్ర ప్రజలు సాగనంపడానికి ఎదురు చూస్తున్నారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఈ కార్యక్రమం లో ఉయ్యూరు మండల, టౌన్ అధ్యక్షులు ఎనిగళ్ల కుటుంబరావు, జంపాన గుర్నాధరావు, తెలుగు యువత నాయకులు దండమూడి చౌదరి, కౌన్సిలర్లు   పండ్రాజు సుధారాణి, పలియాల శ్రీను, జబర్ల పూడి సర్పంచ్ ప్రసాద్, సాయిపురం సర్పంచ్ బాషా మండల,టౌన్ తెదేపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

అగ్ని ప్రమాదంలో తండ్రీ కొడుకులు సజీవదహనం

Murali Krishna

మరో లాక్‌డౌన్.. సీఎంలతో ప్రధాని భేటీ

Sub Editor

గ్రామాలలో తడి, పొడి చెత్త వేరు చేసేందుకు శ్రీకారం

Satyam NEWS

Leave a Comment