22.2 C
Hyderabad
December 10, 2024 10: 06 AM
Slider సంపాదకీయం

ఎంత దోచుకున్నా మావాడు తప్పించుకుంటాడు

#jagan

ప్ర‌జ‌ల సంప‌ద ఎంత దోచుకున్నా మావాడు త‌ప్పించుకుంటాడ‌ని వైకాపా నేత‌లు ధీమాగా ఉన్నారు. సౌర విద్యుత్ కొనుగోలు విషయంలో సీఎంగా ఉన్నప్పుడు జగన్ రెడ్డి రూ.1750 కోట్ల లంచం తీసుకున్నాడని అమెరికా న్యాయస్థానం వెల్లడించిన తర్వాత వైకాపాలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. జగన్ రెడ్డి పై ఇలాంటివి ఎన్ని వచ్చినా కూడా తప్పించుకుంటాడని వైకాపా నాయకులు అంటున్నారు.

అక్రమ ఆస్తుల కేసులో ఇప్పటి వరకూ కోర్టుకు హాజరు కాకుండా కూడా 11 ఏళ్ల నుంచి బెయిల్ పై ఉన్న జగన్ రెడ్డిని ఇలాంటి కేసులు ఏమీ చేయలేవని వారు అంటున్నారు. అదానీ, జ‌గ‌న్ ఇద్ద‌రూ తోడుదొంగ‌లేన‌ని, వారిద్ద‌రూ వారి స్వ‌ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌నిచేస్తార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మేన‌ని, ఇప్పుడు బ‌య‌ట‌ప‌డ్డ లంచాలు పెద్ద విష‌య‌మే కాద‌ని, లోతుగా ద‌ర్యాప్తు చేస్తే..ఇలాంటివి బోలెడు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఒక్క సోలార్ విద్యుత్ కొనుగోలు విష‌యంలోనే ఇన్ని కోట్ల అవినీతి జ‌రిగితే..ఇక పోర్టులు, విద్యుత్ మీట‌ర్లు..ఒక‌టేమిటి..రాష్ట్రంలో జ‌గ‌న్ అదానీకి అప్ప‌గించిన ప్ర‌తిదానిలో అవినీతి ఉంద‌ని, వాటి అవినీతి లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌స్తే..క‌ళ్లుభైర్లు క‌మ్మాల్సిందేన‌నే మాట కూడా వినిపిస్తోంది. జ‌గ‌న్ ల‌క్ష కోట్ల కుంభ‌కోణాలు చేసి ఇన్నాళ్లైనా..అత‌నిని ఏ చ‌ట్టం ఏమీ చేయ‌లేద‌ని, ఇప్పుడు ఏమ‌వుతుంద‌నే భావ‌న అంద‌రిలో వ్య‌క్తం అవుతోంది.

వాస్త‌వానికి ఇప్పుడు జ‌గ‌న్ ఇరుక్కున్న లంచాల కేసు సామాన్య‌మైన‌ది కాదు. ఎందుకంటే అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటున్న కేసు. అదానిపై కేసు పెట్టి..అత‌నిని శిక్షిస్తే..జ‌గ‌న్‌ను కూడా శిక్షంచ‌వ‌చ్చు. కానీ..అటువంటి ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. లంచాల కేసులో జ‌గ‌న్‌ను శిక్షించాలంటే..ముందుగా అదానీని శిక్షించాలి…! కానీ..అదానికి అండ‌గా ఉన్న బిజెపి అత‌నిపై ఈగ కూడా వాల‌నీయ‌దు. అమెరికా ద‌ర్యాప్తు చేసినా..ఇంకెవ‌డు ద‌ర్యాప్తు చేసినా..మోడీ అత‌నిని కాపాడుతూనే ఉంటాడు.

అప్పుడే..బిజెపి ప‌రివారం..అదాని విష‌యంలో..వెన‌కేసుకురావ‌డం మొద‌లుపెట్టింది. దేశంలో అస్థిర‌త సృష్టించేందుకే అమెరికా ఇలా చేస్తోంద‌ని, అందుకే అదానిపై నింద‌లు మోపుతోంద‌ని విమ‌ర్శ‌లు మొద‌లు పెట్టారు. అప్ప‌ట్లో హిండెన్‌బ‌ర్గ్ నివేదిక వ‌చ్చిన‌ప్పుడు చేసిన దానికంటే..ఇప్పుడు మ‌రింత దూకుడుగా అదానీని ర‌క్షించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మోడీ అదానినీ ర‌క్షిస్తే..జ‌గ‌న్‌ను ర‌క్షించిన‌ట్లే..ఎన్నివేల కోట్లు తిన్నా… మొత్తం మీద‌..మోడీ ద‌య ఉన్నంత కాలం తోడు దొంగ‌ల‌కు తిరుగేలేదు.

Related posts

సబితమ్మకు సి.ఎం, డిప్యూటీ సి.ఎం క్షమాపణ చెప్పాలి

Satyam NEWS

మీడియా మానేజిమెంట్ లో బాబు చాకచక్యం

Satyam NEWS

ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను పూర్తి చేయాలి

Bhavani

Leave a Comment