30.2 C
Hyderabad
February 9, 2025 20: 05 PM
Slider ముఖ్యంశాలు

విలేకరిని అడ్డంపెట్టుకుని యుద్ధం చేసి ఓడిపోయిన జగన్ రెడ్డి

#jaganreddy

చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురు అయింది. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సీనియర్ లాయర్లను నియమించినా సుప్రీంకోర్టులో వైసీపీ భంగపాటు తప్పలేదు. స్కిల్ డెవలప్‍మెంట్  కేసులో  చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసుపై హైకోర్టు ఇచ్చిన బెయిల్‍ను రద్దు చేయాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన వైసీపీ భంగపడింది. ఛార్జి సీటు ఫైల్ అయి టెక్నికల్ గ్రౌండ్స్ లో  రిటర్న్ అయి,  బెయిల్ కూడా వచ్చి ఏడాదిన్నర దాటింది.. దాంతో కేసు వినడానికి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇష్టపడలేదు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా అక్రమ కేసులో బెయిల్ రద్దుకు కూడా తెగించిన వైసిపి అనుకూల నేతల కుట్రలను సుప్రీం కోర్టు చిత్తు చేసింది.

అత్యున్నత న్యాయస్థానం ముందు వైసీపీ నవ్వులుపాలైంది. వ్యాజ్యంలో సంబంధం లేని వ్యక్తులు తల దూర్చడానికి వీల్లేదని నిర్ద్వందంగా తోసిపుచ్చింది సుప్రీం కోర్టు. ఇది రాష్ట్రానికి అక్రమ కేసులో అన్యాయంగా ఇరికించబడ్డ వ్యక్తి స్వేచ్ఛకు సంబంధిచిన విషయం. ఈ కేసుతో మీకేం సంబంధమని వ్యాజ్యం దాఖలు చేసిన వారిని సూటిగా ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వ అధినేత అయి కూడా కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తి తన పలుకుబడిని ఉపయోగించి కేసును ఉపసంహరించే ప్రయత్నం చేయటం లేదు కదా అని పిటిషనర్‍ను సూటీగా సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

చార్జ్ షీట్ దాఖలు చేసినందున బెయిల్ రద్దు పిటిషన్‍లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో ఇంటర్‍లొకేటరి అప్లికేషన్ దాఖలు చేసిన విలేఖరి కేజీబీ తిలక్‍పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  మీరెవరు? మీకేం సంబంధం? పిల్ దాఖలుకు అర్హత ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

బెయిల్ వ్యవహారాల్లో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధంలేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ధర్మాసనం హెచ్చరించింది. తిలక్ వేసిన ఇంటర్‍లొకేటరి అప్లికేషన్‍ను డిస్మిస్ చేసింది. కొసమెరువు ఏంటంటే సుప్రీం కోర్టు ఘట్టిగా నెత్తి మీద మొట్టిన ఈ “కేజీబీ తిలక్”అనే సదరు విలేఖరి పొద్దుపొద్దున్నే సాక్షి టీవీలో దర్శనమిస్తాడు. సూర్యుడు వచ్చినా రాకపోయినా, మనోడు మాత్రం సాక్షిలో ప్రెజెంట్ సార్ అంటాడు …. చంద్రబాబును తిడుతూ ఉంటాడు!

Related posts

వనపర్తి జిల్లా సగర మహిళా నూతన కార్యవర్గం ఎన్నిక

Satyam NEWS

రెసిడెన్షియ‌ల్  స్కూల్ ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన మంత్రి అల్లోల‌

Satyam NEWS

అడవుల రక్షణకు పెద్దపులి సంరక్షణ అవసరం

Satyam NEWS

Leave a Comment