కాకికాడ పోర్టు ఆక్రమణ కేసు ఎఫ్ఎఆర్ జగన్ రెడ్డిని ఏ1గా చేర్చాలని టీడీపీ నాయకుడు, రాష్ట్ర ఆక్వా కల్చర్ అథారిటీ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 8,320 ఎకరాల కాకినాడ సెజ్ ను వైసీపీ నేతలు దోపిడీ చేశారన్నారు. వాటాదారుగా ఉన్న కేవీ రావును అన్నివిధాలా బెదిరించి 4వేల ఎకరాల భూమిని అప్పనంగా కొట్టేశారని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఎకరా రూ.29వేలకు దొరకని భూమి జగన్ వర్గీయులకు కాకినాడ సెజ్ లో ఎలా దొరుకుతుందని నిలదీశారు. ప్రముఖ కన్సల్టెంట్ రోహిత్ చతుర్వేది ఇచ్చిన నివేదిక ప్రకారం అక్కడ ఎకరా రేటు రూ.50లక్షల పైచిలుకు ఉందన్నారు.
రూ.2వేల కోట్ల రూపాయల విలువైన కేవీరావు వాటా భూమిని రూ.12కోట్లు ఇస్తామని చెప్పి కొట్టేశారన్నది సుస్పష్టమని చెప్పారు. చెక్ రూపంలో ఇచ్చిన రూ.12కోట్లు కూడా 6 నెలల తర్వాత బ్యాంకులో జమ చేసుకోమనటాన్ని దోపిడీ అనాలా? దొంగతనం అనాలా? అని నిలదీశారు. చెక్ రూపంలో ఇచ్చిన రూ.12 కోట్లు 6 నెలల తర్వాత జమ కావటం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జగన్ ప్రమేయం లేకుండా ఇది జరగని పని అని ఆరోపించారు. కాకినాడ పోర్టు కైవసం కోసం భారీ మోసానికి పాల్పడ్డారన్నారు.