34.2 C
Hyderabad
April 19, 2024 20: 35 PM
Slider గుంటూరు

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి

#dr.chadalawada

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏ పీ ప్రస్తావన లేకపోవటం దురదృష్టకరమని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

నరసరావుపేట పట్టణంలోని స్థానిక 09 వార్డ్ రవీంద్ర నగర్ లో జరిగిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఏపీని పూర్తిగా విస్మరించడం,సొంత ప్రయోజనాల కోసమే వైసిపి ఎంపీలు కేంద్ర మంత్రులతో,ప్రధానితో భేటీలు తప్ప రాష్ట్రానికి నిధులు రాబట్టడం కోసం కాదన్నారు. అందుకే ఏపీ గురించి ప్రస్తావించ లేదు,ఏపీ సమస్యలను పట్టించుకోలేదన్నారు. బడ్జెట్ అంతా ఆశాజనకంగా లేదు ప్రస్తుత సమస్యలను,సవాళ్లను పరిష్కరించేలా కేంద్ర బడ్జెట్ లేదు.

దేశంలో,రాష్ట్రాలలో చాలా సమస్యలు ఉన్నా కానీ బడ్జెట్లో వాటి పరిష్కారానికి మార్గాలు చాలా తక్కువ అన్నారు. పేదరికం ఆర్థిక అసమానతల తొలగింపు గురించి ప్రస్తావించలేదని పేదలకు ఇచ్చే సబ్సిడీలలో ప్రభుత్వం సహకారం కనిపించడం లేదన్నారు. ఏపీ పునర్విభజన చట్టం అంశాలకు సంబంధించి పరిష్కారం లేకపోవడం బాధాకరం అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైసిపి ఎంపీలే దీనికి పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ మీదకెక్కి ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేసిన విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు ఎక్కట్లేదు చెప్పాలన్నారు. తమ కేసుల మాఫీ యావే తప్పా కేంద్ర బడ్జెట్ లో నిధులు చేద్దామన్న ఆలోచన సీఎం జగన్ రెడ్డి కి లేదన్నారు.

25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడ వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం ఆ దిశగా ప్రయత్నం లేదన్నారు.ఈ వైఫల్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని జగన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రజల్లో ఆశలు కల్పించాలన్నారు.

పదవి లోకి వచ్చాక ప్రత్యేక హోదా రాబట్టడం గురించి గాని,పెట్టుబడులు రాబట్టడం పై గాని ఆయన దృష్టి లేదన్నారు. ఎంతసేపు తమ కేసుల మాఫీ పై ఆలోచనలు తప్ప రాష్ట్ర అభివృద్ధి పై దృష్టి లేదన్నారు. దీనితో కేంద్రాన్ని డిమాండ్ చేసే హక్కును కూడా జగన్ రెడ్డి కోల్పోయారని,28 మంది ఎంపీలు ఉండి కూడా కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో విఫలం అయ్యారన్నారు.

151 నంది ఎమ్మెల్యే నుండి కూడా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు తప్ప, అంతర్గత వనరులు పెంచి, కేంద్రం నిధులు రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లేకపోవడం బాధాకరమన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే

Satyam NEWS

యూట్యూబ్ లో రాంగ్ గోపాల్ వర్మ ‘మాయ’

Satyam NEWS

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రయివేటు ఉపాధ్యాయులు

Satyam NEWS

Leave a Comment