Slider సంపాదకీయం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్ రెడ్డి కట్టుకథలు

#chandrababunaidu

చంద్రబాబు సీఎం అయిన ఏడు నెలల్లోనే రూ.1.54 లక్షల కోట్లు అప్పు చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పడం పూర్తిగా అసత్యమని ప్రభుత్వ లెక్కలతో రుజువు అవుతున్నది. ఈ ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు కాగా, రూ.20,000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో అప్పటి జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే కావడం గమనార్హం. అదే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం రూ.1.40 లక్షల కోట్లను వివిధ రూపాల్లో బకాయీపడ్డది. అంతే కాకుండా ఆర్ధిక సంఘం ఇచ్చే నిధులను కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే వాడేసింది. జగన్ రెడ్డి దోపిడీతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. జగన్ రెడ్డి పాపం కూటమి ప్రభుత్వానికి,  రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది.  

ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏడు నెలల్లో జగన్ రెడ్డి పెట్టిన బకాయిలు చెల్లించింది.  రైతులకు ధాన్యం బకాయిలు 1674 కోట్లు, ఆరోగ్య శ్రీ కి 1800 కోట్లు, ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు రూ.519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు,సీపీఎస్‌కు సంబంధించిన బకాయిలు రూ.300 కోట్లు,టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు రూ.265 కోట్లు,  విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్  బకాయిలు రూ.788 కోట్లు,  ఇలా వివిధ రంగాలలో 22,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది.  

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇప్పటివరకు  రూ.21 వేల  కోట్లు ఖర్చు చేశారు. అదీ కాక జగన్ రెడ్డి  చేసిన అప్పులకు,  అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.71వేల కోట్ల చెల్లింపులు చేయాల్సిన భారం  కూటమి ప్రభుత్వం పై పడింది. అంటే ఈ ఎనిమిది నెలలకి జగన్ చేసిన అప్పుకి  రూ. 45,000 కోట్లు రూపాయల భారం కూటమి ప్రభుత్వంపై పడింది. కూటమి  ప్రభుత్వం ఏర్పడ్డాక కేవలం 5 నెలల్లోనే  రూ. 12,367 కోట్ల జగన్ ప్రభుత్వ అప్పులను క్లియర్ చేసింది. ఇది కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనడానికి నిదర్శనం. గత జగన్‌ ప్రభుత్వం మొదటి 7 నెలల్లో పింఛన్‌లు రూ.250 పెంచడం తప్ప మరే ఇతర నవరత్న హామీలను అమలు చేయలేదు.

చంద్రబాబు ప్రభుత్వం పింఛను ఒకేసారి రూ.1000 పెంచి రూ.4 వేలు 1వ తేదినే ఇళ్ల వద్ద ఇవ్వడం జరుగుతోంది. ఏడాదికి రూ.33 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.1.60 లక్షల కోట్లు పింఛన్‌లకు ఖర్చు చేయనుంది. ఇది దేశంలోనే రికార్డ్.

263 అన్న క్యాంటిన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది. దీపం-2 కింద 90 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల సరఫరా చేస్తుంది. రాబోయే ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు పధకం, మే నెల నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పధకాలను ప్రారంభిస్తుంది. ఇక ఈ సీజన్లో  రాష్ట్రంలో 5,08, 261 మంది రైతుల నుంచి 31,93,769 మెట్రిక్ టన్నుల ధాన్యాన్నికొనుగోలు చేసి రూ.7,354.37  కోట్లు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే కూటమి ప్రభుత్వం జమ చేసింది.

కాగ్ లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి నవంబర్ వరకు అయిన ప్రభుత్వ ఖర్చు : Rs.1, 09,328.46 కోట్లు (లక్షా 9 వేల కోట్లు) మాత్రమే అని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. గతంలో ఆర్ధిక సూచీలో 3,4 వ స్థానంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ని జగన్ రెడ్డి  17 వ స్థానానికి దిగజార్చాడని నీతి ఆయోగ్ నివేదిక చాచి కొట్టినట్లు చెప్పింది. జగన్ రెడ్డి నిర్వాకంతో రాష్ట్రంలోని  అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురయ్యి  వెంటిలేటర్ పై ఉన్న పేషెంట్ లా ఏపీ పరిస్థితి  తయారయింది. ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని నిలబెట్టేలా, సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేని జగన్   అబద్దాలు, కట్టు కథలు, కల్లబొల్లి కబుర్లతో ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ చెబుతున్నది.

Related posts

జువారీ సిమెంట్స్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ

Satyam NEWS

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

మహిళ వేధింపు కేసులున్న వైసీపీ ఎంపీ,ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment