37.2 C
Hyderabad
April 19, 2024 14: 27 PM
Slider పశ్చిమగోదావరి

పేద ప్రజల నడ్డివిరిచిన జగన్ రెడ్డి పాలన

రాష్ట్రంలో వై సి పి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలు ప్రజల జీవన విధానం భారంగా మారిందని దెందులూరు మాజీ ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరం పంచాయతీ దుర్గమ్మ కాలనిలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. వై సి పి పాలనలో నిత్యావసరాల రేట్లు పెంచి ప్రజల జీవితాలలో ఎదుగుదల లేకుండా రాక రకాల పన్నులు విధిస్తూ ఆర్థికంగా అణగదొక్కుతున్నారని అన్నారు. వై సి పి పాలన వైఫల్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా టి డి పి బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చింతమనేని రామసింగవరం గ్రామంలో వై సి పి పాలనలో పెరిగిన ధరలను వివరిస్తూ ఇంటింటికి తిరిగారు.

టి డి పి పాలనలో ఉన్న ధరలకు, వై సి పి పాలనలో పెరిగిన ధరలను ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేసారు. 5 లక్షలు తో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేసారని అన్నారు. టి డి పి అధికారంలోకొచ్చిన తరువాత రామసింగవరం గ్రామంలో ప్రతి ఒక్కరి ఇళ్లు కట్టిస్తానన్నారు. విద్యుత్, డీజిల్, గ్యాస్, పెట్రోల్, వంటనూనెల ధరలు విపరీతంగా పెంచేసి పేదల నడ్డివిరుస్తున్నారని చింతమనేని జగన్ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. ధరలు డిగిరావాలంటే జగన్ డిగిపోవాల్సిందేనని అప్పటివరకు టి డి పి ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామన్నారు. నియంత ప్రభుత్వం మెడలు వంచుదామంటూ టి డి పి శ్రేణులతో కలిసి డోలు వాయిద్యాలతో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ అడపా శ్రీనివాసరావు, ఎం పి టి సి గుర్రం మాధవరావు, బొప్పన సుధాకర్, తాతా సత్యనారాయణ, గితాయా సత్యనారాయణ, అడపా రాఘవ, ముసునూరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాల పై ఆంక్షలు

Satyam NEWS

కుల పిచ్చికి బదిలీ శిక్ష: దిమ్మ తిరిగిన అమ్మిరెడ్డి

Satyam NEWS

30 పాఠ‌శాల‌ల‌ను ఎత్తివేసే యోచ‌న‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వం…!

Satyam NEWS

Leave a Comment