అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ఓ ప్రసంగం చాలా మందికి పదే పదే గుర్తుకు వస్తూ ఉంటుంది. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియాలో తెగ వరల్ అయిన సదరు వీడియో ఇప్పటికీ అప్పుడప్పుడు ట్రెండింగ్ లోకి వస్తూనే ఉంటుంది. 2014 ఎన్నికల తర్వాత అసెంబ్లీలో విపక్ష నేత హోదాలో ఆయన చేసిన సదరు ప్రసంగంలో… తాను అవినీతికి పాల్పడనే లేదని చెప్పుకున్నారు. అంతేకాకుండా తన ఆస్తులు లక్ష కోట్లు అని ప్రచారం చేస్తున్నారని వాపోయిన జగన్… ఆ మేర ఆస్తులను చూపిస్తే.. ఆ ఆస్తులన్నింటినీ నిరూపించిన వారికే రాసి ఇస్తానని ఓ రేంజిలో సవాల్ విసిరారు.
జగన్ ను అభిమానించే వారికి ఆ వీడియో సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటే… జగన్ నిజ స్వరూపం తెలిసిన వారు మాత్రం ఈ వీడియో కనిపించినంతనే… అవినీతి గురించి సుద్దులు జగన్ మాత్రమే చెప్పాలంటూ సెటైర్లు సంధిస్తారు. ఇప్పుడు బయటపడిన జగన్ చేతివాటం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇప్పటికే దాదాపుగా అన్ని విధానాల్లో ప్రజాధనాన్ని నొక్కేసిన జగన్… తాజాగా హెలిప్యాడ్ పేరిట లక్షలకు బదులుగా కోట్లను కొల్లగొట్టేశారు.తాను సీఎంగా ఉండగా… తనకున్న పదవిని అడ్డం పెట్టుకుని జగన్ జల్సాలు చేశారు. తాడేపల్లిలోని తన ఇంటిలో ఏర్పాటు చేసుకున్న క్యాంపు కార్యాలయానికి అవసరమయ్యే పెన్నులు, పేపర్ల కోసం ఆయన ఏకంగా రూ.10 కోట్ల మేర ప్రజాధనాన్ని నొక్కేశారు.
ఇక అదే క్యాంపు కార్యాలయానికి వచ్చిన అతిథులకు టీ, ఎగ్ పఫ్ లను అందించడం కోసమంటూ జగన్… మరో రూ.3.5 కోట్లను నీళ్లలా ఖర్చు చేశారు. ఇక తన సొంత నివాసానికి ఇనుప కంపె వేసుకునేందుకు జగన్ ఏకంగా రూ.13 కోట్ల మేర ప్రజా ధనాన్ని వనియోగించుకున్నారు. ఇలా లెక్కపెట్టుకుంటూ పోతూ ఉంటే… జగన్ చిట్టాలో చాలా పద్దులే ఉన్నట్టున్నాయి.. వాటిలో ఇప్పుడు మరొకటి బయటకు వచ్చింది. రూ.9 లక్షలతో ఏర్పాటు చేసుకునే హెలిప్యాడ్ ను జగన్ ఏకంగా రూ.9 కోట్లు పెట్టి ఏర్పాటు చేసుకున్నారట.
అంటే… హెలిప్యాడ్ పేరిట జగన్ ఏకంగా రూ.9 కోట్లను తన జేబులో వేసుకున్నారన్న మాట.సీఎం హోదాలో ఉన్న నేతకు ఆయా పర్యటనల్లో హెలికాప్టర్ ను వినియోగించడం సర్వసాధారణమే. హెలికాప్టర్ తో పాటు ప్రత్యేక విమానాన్ని కూడా వినియోగిస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ప్రత్యేక విమానం కోసమైతే ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం లేదు గానీ… హెలికాప్టర్ వినియోగించాలంటే మాత్రం కొన్నిప్రత్యేక ఏర్పాట్లు అవసరం అవుతాయి. వాటిలో హెలిప్యాడ్ ప్రధానమైనది. ఈ హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసుకునేందుకు ఎంత ఎక్కువ అనుకున్నా… రూ.9 లక్షలతో అద్భుతమైన హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు.
అది కూడా శాశ్వత ప్రాతిపదికన ఆ మొత్తంతోనే హెలిప్యాడ్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. జగన్ మాత్రం తాను నిర్మించుకున్న హెలిప్యాడ్ కోసం ఏకంగా రూ.8.6 కోట్లను వినియోగించారు. సర్కారు ఖజానా నుంచే ఈ మొత్తాన్ని ఆయన డ్రా చేసుకున్నారు. అంటే…ఇప్పటిదాకా ప్రతి చిన్న విషయానికి కూడా కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని అప్పనంగా నొక్కేసిన జగన్… చివరకు హెలిప్యాడ్ నిర్మాణం పేరిట కూడా ప్రజా ధనం నుంచి రూ.9 కోట్లను నొక్కేశారన్న మాట. ఈ లెక్కన ఇంకా బయటపడని జగన్ లీలలు ఎన్ని ఉన్నాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.