36.2 C
Hyderabad
April 25, 2024 21: 50 PM
Slider గుంటూరు

భారత్ బంద్ కు జగన్ మద్దతు కంటితుడుపు చర్యే

#navataramparty

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి అధికారులు పని చేయడం చూస్తుంటే భారత్ బంద్ కు జగన్ మద్దతు ఉందా లేదా అని సందేహం కలుగుతోంది అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ప్రభుత్వం తో పోరాటం చేయడానికి భయంతో ఉన్నారని మెతక వైఖరిని అవలంబిస్తున్నారని అన్నారు.

300 రోజుల రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. మోడీ మెడలు వంచే స్థాయిలో రైతుల ఉద్యమం బలపడుతున్న విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లో భారత్ బంద్ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలతో పాటుగా పాల్గొన్న రావు సుబ్రహ్మణ్యం మునిసిపల్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం,ఎండిఓ కార్యాలయం,పోస్టల్ కార్యాలయం,ఎల్.ఐ. సి కార్యాలయం,ఎస్బిఐ మరియు అన్నీ బ్యాంకులు, వ్యాపార సంస్థలు మూసివేయించారు.

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రజా వ్యతిరేక నల్ల చట్టాలు, వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. మోడీ విధానాలు నశించాలని నినాదాలతో హోరెత్తించారు. భారత్ బంద్ లో నవతరం పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ కన్వీనర్ బత్తుల అనిల్,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీష్ బాబు,సీపీఎం నేత బొల్లు శంకరరావు,సీపీఐ ఏఐటీయూసీ నేత కాసా సాంబయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత మాదాసు పృథ్వి సాయు,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత అడపా మోహన్,టీడీపీ టి ఎన్ ఎస్ ఎఫ్,తెలుగు యువత నాయకులు,జాకీర్ కరిముల్లా, అబ్దుల్లా మజహర్,మాలిక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు నసిరుద్దీన్, దార్ల రాజు పార్టీలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

అడ్డుగా మేకులు

Sub Editor 2

ఈటలకు బ్రహ్మరథం పట్టిన హుజురాబాద్ ప్రజలు

Satyam NEWS

అన్నపూర్ణ క్యాంటిన్ ప్రారంభించిన మాగంటి గోపీనాథ్

Satyam NEWS

Leave a Comment