31.7 C
Hyderabad
April 18, 2024 23: 26 PM
Slider శ్రీకాకుళం

ఘనంగా జగనన్న విద్యా కానుక కార్యక్రమం

#JaganannaKanuka

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో “జగనన్న విద్యా కానుక” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్ కలక శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యా కానుక వల్ల పేద విద్యార్థిని విద్యార్థులకు మేలుకలుగుతుందని అన్నారు.

వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గుతుందని తమ పిల్లల్ని ఉన్నత విద్యావంతులను చేసేందుకు వీలుకులుగుతుందని ఆయన అన్నారు. ఈ పథకాన్ని ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి  కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు మక్క శ్రీనివాస్, ఉపాధ్యాయునీఉపాధ్యాయులు,  గ్రామ పెద్దలు , పాఠశాల విద్యా కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కలగ రవణమ్మ, ఇప్పిలి పద్మ ,విద్యార్థినీవిద్యార్థులు, అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Satyam NEWS

స్త్రీ జాతి చైతన్యం కోసం పరితపించిన గుడిపాటి వెంకటాచలం

Bhavani

హంస వాహనంపై శ్రీ కోదండ‌రాముడి క‌టాక్షం

Satyam NEWS

Leave a Comment