25.2 C
Hyderabad
January 21, 2025 11: 16 AM
Slider జాతీయం

ప్లాన్ మిస్: జైషే ఉగ్రవాదుల కుట్ర భగ్నం ఐదుగురి అరెస్ట్

jaise terrorist

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భారీ కుట్రకు ప్రణాళిక చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని శ్రీనగర్ పోలీసులు అరెస్ట్ చేశామని సెంట్రల్ కశ్మీర్ రేంజ్ డీఐజీ వెల్లడించారు.అరెస్ట్ అయిన ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

అరెస్టు చేసిన ఐదుగురిని ఐజాజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, షఫీల్ ఫరూక్ గోజ్రీ, నసీర్ అహ్మద్ మిర్‌లుగా పోలీసులు గుర్తించారు పుల్వామా సహా భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో జేషే పాత్ర ఉందని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గత ఏడాది ఫిబ్రవరిలో జేషే మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు

Related posts

మే డే స్ఫూర్తితో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి

Satyam NEWS

19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్.. 70 కొత్త కేసులు

Sub Editor

తిరుమల శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment