27.7 C
Hyderabad
March 29, 2024 03: 47 AM
Slider జాతీయం

డేంజర్ ట్రెడిషన్ : తమిళనాడులో మొదలైన జల్లికట్టు

jallikattu tamilnadu

జల్లికట్టు తరతరాలుగా తమిళనాట కోనసాగుతున్న సంప్రదాయ ఆట. పొంగల్ సందర్భంగా తమిళనాడులోని మధురైలో జల్లికట్టు ఆట మొదలైంది. అవనియపురంలో సాగుతున్న ఈ జల్లికట్టులో దాదాపు 700 ఎద్దులు పాల్గొంటుండగా అలంగనళ్లూరులో 700, పలమేడులో 650 ఎద్దులతో పోటీలు నిర్వహిస్తున్నారు.వాటిని నియంత్రించి పోటీలో గెలిచేందుకు 730 మంది క్రీడాకారులు సిద్ధమయ్యారు.

మధురైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరులో కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. మాజీ న్యాయమూర్తి జెమికం, మధురై మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ పోటీలు సాయంత్రం వరకు కొనసాగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనడానికి దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రప్రజలంతా ఈ పోటీలను వీక్షించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గాయపడిన వారి కోసం వెంటనే వైద్య చికిత్స అందజేసేలా అంబులెన్సులు, ప్రాథమిక వైద్య కేంద్రాలు అందుబాటులో ఉంచారు.

Related posts

బూర్గుల్ దళిత బాధితులకు వెంటనే న్యాయం చేయాలి

Satyam NEWS

అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన రజనీకాంత్

Satyam NEWS

గణనీయంగా తగ్గనున్న మందుల ధరలు

Satyam NEWS

Leave a Comment