37.2 C
Hyderabad
March 28, 2024 19: 28 PM
Slider జాతీయం

జమ్మూకశ్మీర్‌ జైళ్ల నుంచి భారీగా ఉగ్రవాదుల తరలింపు

జమ్మూకశ్మీర్‌లో ఒక్కసారిగా ఉగ్రవాద ఘటనలు పెరిగిపోవడంతో అక్కడి జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను ఇతర రాష్ట్రాల జైళ్లకు తరలిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న 38 మంది ఖైదీలను ఆగ్రా సెంట్రల్ జైలుకు తరలించారు.

వీరంతా లోయలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా తీవ్రవాదులకు పెద్ద ఎత్తున సహాయం చేసిన ఖైదీలని అధికారులు చెబుతున్నారు. జమ్మూ లోని సెక్షన్ 10 (బి), కాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, 1978 కింద ఖైదీలను వేరొక జైలుకు మార్చవచ్చు. 

దీంతో ఇప్పటి వరకు 56 మంది ఉగ్రవాదులను తరలించినట్టయింది. అయితే, ఈ తరలింపు ఎందుకు జరిగిందో ప్రభుత్వం స్పష్టం చేయలేదు. తరలింపుతో తీవ్రవాద నెట్‌వర్క్ బలహీనపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Related posts

మార్చి 4న కొవ్వూరు లో జయేంద్ర సరస్వతి జయంతి

Satyam NEWS

ఏపి గవర్నర్ కు త్వరలో స్థాన చలనం తప్పదా?

Satyam NEWS

పెండింగ్ పనులను పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment