38.2 C
Hyderabad
April 25, 2024 14: 28 PM
Slider రంగారెడ్డి

జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం

#MLA Pargi

వలస కూలీల కోసం జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం కుల్కచర్ల మండల కేంద్రంలో ముంబై, పూనా నుండి తిరిగి వచ్చిన వలస కూలీల కు జన్ సహస్ స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి  ఎమ్మెల్యే  మహేశ్ రెడ్డి ముఖ్య  అతిథిగా హాజరై మాట్లాడారు. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కూలీలు అందరూ లేబర్ కార్లను కలిగి ఉండాలని వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు.

ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డులను కలిగి ఉండాలని  సూచించారు. గ్రామాలలో కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఉంటే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు  లేబర్ కార్డు నమోదు చేయాలని అన్నారు. జన్ సహస్ స్వచ్ఛంద సంస్థ వలస కార్మికులపై పనిచేస్తూ కష్టాలను తెలుసుకుని వారికి అండగా ఉండేందుకు భరోసాగా నిత్యావసర వస్తువులు అందించడం సంతోషంగా ఉందన్నారు.

అనంతరం జన్ సహస్ బోర్డ్ డైరక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ..లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీలు ఇబ్బందులు పడుతు కష్టాలు పడుతున్న వారికి సంస్థ తరపున సహాయం చేస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో పరిగి నుండి ఇతర రాష్ట్రాలకు వెళ్ళే కార్మికులను సంస్థ తరపున పంపించామన్నారు.

ప్రస్తుతం ముంబాయి,పుణె నుండి తిరిగి వచిన మన ప్రాంతాల కార్మికులకు సంస్థ తరపున నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడంతో పాటు కూలీలకు  లేబర్ కార్డు పొందేలా సంస్థ కృషి చేస్తోంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్య హరిచందర్, జడ్పీటీసీ రాందాస్ పాల్గొన్నారు. ఇంకా, సర్పంచులు  పట్లొల్ల సౌమ్య రెడ్డీ,   విజయలక్ష్మి, రవికుమార్, శంకర్ నాయక్, జన్ సహస్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్, స్వెరొస్ జిల్లా అధ్యక్షులు లఖ్నాపుర్ శ్రీనివాస్, అంబేడ్కర్ విజ్ణన వేదిక జిల్లా అద్యక్షులు టి.వెంకటయ్య, అనంతయ్య, ఎంపిటిసిలు, ఆనంద్, అనసూయ, ఎంఈఓ హరిశ్చందర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కో ఎగ్జిస్టెన్స్: మతసామరస్యానికి నిదర్శనం రంగాపూర్ ఉత్సవాలు

Satyam NEWS

తెలుగు మ‌హిళా ఆధ్వ‌ర్యంలో వంట-వార్పు..!

Sub Editor

సేవా కార్యక్రమంలో ట్రాఫిక్, ఆర్మర్డ్ పోలీసులు..!

Satyam NEWS

Leave a Comment