25.2 C
Hyderabad
January 21, 2025 11: 21 AM
Slider సినిమా

జానకి వెర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ

సూపర్ స్టార్ సురేష్ గోపి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మాతగా ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో వస్తున్న యదార్థ సంఘటనల ఆధారంగా వాస్తవిక దృక్పధ కోణంలో తీసిన సినిమా జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (జె. ఎస్. కె). బైజు సందోష్, మాధవ్ సురేష్ గోపి, దివ్య పిళ్లయి, అస్కర్ అలీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

ఇంటెన్స్ కోర్టు డ్రామాగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అనుపమ పరమేశ్వరన్ సినిమాలో జానకి పాత్రలో నటిస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జానకి పై జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొంది అన్న అంశాన్ని ఇంటెన్స్ డ్రామాగా నిర్మించారు. ఈ కేసును వాదించే లాయర్ పాత్రలో సూపర్ స్టార్ సురేష్ గోపి గారు నటించారు.

ఈ సినిమాని ఫిబ్రవరిలో విడుదల చేస్తామని మూవీ మేకర్స్ తెలిపారు. నటీనటులు : సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్, రచన & దర్శకత్వం: ప్రవీణ్ నారాయణన్, నిర్మాత: జె. ఫణీంద్ర కుమార్, బ్యానర్: కాస్మోస్ ఎంటర్టైన్మెంట్, సహ నిర్మాతలు: సేతురామన్, హుమాయున్ అలీ అహమ్మద్ DOP: రెనదివ్, ఎడిటర్: సంజిత్ మహమ్మద్, సంగీతం : గిరీష్ నారాయణన్ , జిబ్రాన్, పి ఆర్ ఓ : మధు వి ఆర్

Related posts

వివాదాస్పదమవుతున్న రైతు వేదికలు

Satyam NEWS

రాయలసీమకు నీళ్లు, నిధులు, నియామకాలు కావాలి!

mamatha

విజయసాయి రెడ్డి తోక్‌ కట్‌ చేసిన జగన్‌..?

Satyam NEWS

Leave a Comment