రెండు రోజుల ఎదురు చూపు తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జె పి నడ్డా దర్శన భాగ్యం కలిగింది. నేటి మధ్యాహ్నం ఆయన జేపీ నడ్డాను కలిశారు. ఢిల్లీలోని నడ్డా నివాసంలో జరిగిన ఈ భేటీలో పవన్ కల్యాణ్ తో పాటు జనసేన నేత నాదెండ్ల మనోహర్, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా పాల్గొన్నారు.
బీజేపీ నేతలతో అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర హోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసేందుకు పవన్ కల్యాణ్ ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. బీజేపీ పెద్దలు ఎవరితోనూ అపాయింట్‌మెంటు లభించకపోవడంతో చివరకు జేపీ నడ్డాను మాత్రమే ఆయన కలుసుకోగలిగారు. అనంతరం పవన్ నేరుగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు బయల్దేరారు.