33.2 C
Hyderabad
April 26, 2024 01: 49 AM
Slider విజయనగరం

పార్టీ మైలేజ్ కోసమా…వ్యక్తి గత ప్రతిష్ఠ కోసమా…

#vijayanagarampolice

విజయనగరం జనసేన పార్టీలో ఆమె దారెటు…?

విజయనగరం జనసేన పార్టీ లో నువ్వా ,నేనా అన్న పోటీ సాగుతోందా…ఆ పార్టీ ఇటీవలే చేరిన ప్రముఖ పారిశ్రామిక వేతకు పార్టీ అధిష్టానం అండదండలు గట్టిగా నే ఉన్నాయా…ఇక పార్టీ లో తన మైలేజ్ కోసం… లేడీ నేత యత్నాలు చేస్తోందా అంటే… అవుననే చెప్పాలి. అందుకు తార్కాణమే…విజయనగరం “బొగ్గులదిబ్బ అంశం”.అక్కడే యాభై ఏళ్లుగా దళితులు ఉంటున్న నిర్వాసితులకు నోటీసులు ఇవ్వకుండా తొలగించడాన్ని సీపీఎం పార్టీ అడ్డుకోవడంతో.  జనసేన పార్టీ కూడా సై అంది.ఈ క్రమంలో ఆ పార్టీ మహిళా నేత రంగంలో కి దిగి… గతంలో కేసు ఉన్న ఓ వ్యక్తి ని తీసుకుని…బొగ్గులదిబ్బ కు చేరుకుని నానా యాగీ చేయడం…అక్కడే వామపక్షనేతలను తరిమి కొడుతున్న పోలీసులను అడ్డగించిన జనసేన పార్టీ మహిళా నేత తన పవన్ చూపించేందుకు యత్నించారు.

పరిస్థితి హద్దు మీరుతుండటంతో వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు… ఎస్ఐ లు అశోక్ ,భాస్కర రావులు జనసేన కార్యకర్తలను…అక్కడ నుంచీ వెళ్లిపోవాలని… వేడుకున్నారు కూడా. అయినా జనసేన పార్టీ మహిళా నేత పోలీసుల ఆదేశాలను పక్కన పెట్టి… పోలీసులపైనే గట్టిగా కేకలు వేయడంతో స్పందించిన పోలీసులు… ఫోరంలో తేల్చుకోవాలని…ఇక్కడ వద్దని గట్టిగా సమాధానం ఇచ్చారు. అప్పటికే జనసేన పార్టీ నేతలు వినకపోవడంతో… స్టేషన్ కు తరలించే యత్నం చేశారు.

ఇక స్టేషన్ నుంచీ జనసేన పార్టీ మహిళా నేత…మీడియా కు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయాన్ని కనుక్కునేందుకు “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి… సాయంత్రం స్టేషన్ కు వెళితే… అప్పటికే పార్టీ నేతలు వెళ్లిపోవడంతో… వన్ టౌన్ స్టేషన్ సీఐ డా.వెంకటరావు ను సంప్రదించింది.మేమేమీ వాళ్లను దుర్భాషలాడలేదని… మర్యాద పూర్వకంగా నే వెళ్లిపోవాలని చెప్పామన్నారు.ఇక అప్పుడే ఆ విషయంపై..జనసేన పార్టీ నేత..ప్రముఖ పారిశ్రామిక వేత్త గురాన అయ్యలు… సీఐ ను కలిసారు. విషయం పెద్దది అవ్వకుండా చూడాలని… కోరారు.

చట్ట ప్రకారమే వెళుతున్నామని…మేము ఎవ్వరినీ ధూషించలేదని…”సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి కి చెప్పారు. ఏదైనా బొగ్గులదిబ్బ అంశం కాస్త…జనసేన పార్టీ మైలేజ్ ను ఎంతవరకు తీసుకెళుతోందో లేక నేతల వ్యక్తి గత ప్రతిష్ఠకు ప్రాధాన్యత ఇస్తోందో చూడాలని అంటోంది..”సత్యం న్యూస్. నెట్”.

Related posts

కొల్లాపూర్ ప్రాంతంలో పెద్దఎత్తున నల్లబెల్లం స్వాధీనం

Satyam NEWS

గ‌ణేష్ నిమజ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్న తనయులు

Satyam NEWS

Leave a Comment