జనతా కర్ఫ్యూ సందర్భంగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గంటానాదం చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టేందుకు సాహసోపేతంగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది, పోలీసులు, మీడియా, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు హైదరాబాదులోని ఇంటి ప్రాంగణంలోని తన ఇంటి నుంచి గంట మోగించారు. మహమ్మారిని అదుపు చేసేందుకు వారు చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినవే. వారికి కృతజ్ఞతలు తెలియజేయడం మన విధి అని ఆయన అన్నారు.
previous post