27.7 C
Hyderabad
April 25, 2024 10: 05 AM
Slider విజయనగరం

ప్రజాసమస్యలు అధికారులకు పట్టవా..?: జనసేన ప్రశ్న

#janasena

ప్రజా సమస్యలపైన,వారి ఆరోగ్యం పైన విజయనగరం మున్సిపల్ కార్పొ రేషన్ వారికి ఇంత నిర్లక్ష్యమా అంటూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్  పాలవలస యశస్వి మున్సిపాలిటీ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. రెండో డివిజన్ పరిధిలోని కొత్తపేట నీళ్ళ ట్యాంక్ వద్ద హ్యాపీ బార్ ఎదురు కాలనీలో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జనసేన సభ్యత్వ శిబిరాన్ని పెట్టి పార్టీ సభ్యత్వాలు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో డివిజన్ ప్రజలంతా మౌలిక సదుపాయాలైన మంచినీటి కుళాయిలు లేవని,కాలువల పూడికతీత లేదని, కొందరు వస్తున్న పెన్షన్లు తీసివేశారని వాపోయారని అన్నారు.

ప్రజల ఆరోగ్యం పట్ల మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని,కాలువలు పూడికతీత పనులు చేయకుండా, పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత ఆరునెలలగా కాలువల్లో బ్లీచింగ్ కూడా చల్లట్లేదని, ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడుతూ డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఉండడాన్ని ఆమె అసహనం వ్యక్తం చేశారు.  ప్రజల తరుపున జనసేన పార్టీ పోరాడుతోందని ప్రజలపట్ల మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్య వైఖిరి విడనాడాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో  జనసేన పార్టీ సీనియర్ నేతలు  త్యాడ రామకృష్ణారావు(బాలు),జనసేన మైనారిటీ నాయకులు హుస్సేన్ ఖాన్,నాయకులు తాతపూడి రామకృష్ణ మాష్టారు,కిలారి ప్రసాద్, గేదెల సాయి కుమార్,దుర్గేష్, జి.పవన్ సాయి,భవాని, హాబీద్,రఘు,తదితరులు పాల్గొన్నారు.

Related posts

తిర్యాని మండలంలో దారుణ హత్య

Satyam NEWS

మంత్రి రోజా కు ఘన స్వాగతం పలికిన కరకంఠాపురం ప్రజలు

Bhavani

తిరుమల జూనియర్ కాలేజీలో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment