కరోనా వైరస్ పై పోరాడేందుకు భారతీయులంతా ఆదివారం జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు జనతా కర్ఫ్యూకు నీరాజనం పలికారు.
తెలంగాణా సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉదయం ఆరుగంటల నుండే ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా అన్ని గ్రామాల రోడ్లు నిర్మాణుష్యంగా మారాయి. ఉదయం నుండి రాత్రివరకు ఒకే రీతిలో జనతా కర్ఫ్యూ కొనసాగింది. రాత్రి తొమ్మిదింటి వరకు ఎవ్వరూ రోడ్లపైకి రాకుండా ఇండల్లోనే ఉన్నారు.
మోదీ పిలుపు మేరకు సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్లు, పోలీసులు,పాత్రికేయుల సేవలకు కృతజ్ఙతా భావంతో ప్రతి ఒక్క ఇంట్లో చప్పట్లు, గంట, శంఖానాధాలు చేశారు. ప్రజలంతా ఇంట్లో ఉండగా ఎర్రటి ఎండలో పోలీసులు, డాక్టర్లు, అధికారులు, పాత్రికేయులు చేసిన చేవలకు జనాలు సోషల్ మీడియాలో కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.