శర్వానంద్, సమంత జంటగా నటించిన చిత్రం జాను. ఈ చిత్ర బృందం నేడు తిరుమల లో శ్రీవారిని దర్శించుకుంది. నేటి ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు స్వామివారిని దర్శించుకున్న వారిలో హీరో శర్వానంద్, హీరోయిన్ సమంత, నిర్మాత దిల్ రాజు తదితరులు ఉన్నారు. జాను చిత్రం మంచి విజయం సాధించిందని ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు అన్నారు. తమిళ చిత్రం డబ్బింగ్ చేసినా తెలుగు ప్రజలు ఆదరించారని ఆయన అన్నారు. అదే విధంగా ఈ చిత్రానికి అభిమానుల నుండి స్పందన చాలా బాగుందని ఆయన అన్నారు. శర్వానంద్, సమంతలు తమ నటనతో అభిమానులను ఆకట్టుకున్నారని దిల్ రాజు అన్నారు. త్వరలో నానితో “ఉగాదిరోజు” చిత్రం మార్చ్ 25 న విడుదల అవుతుందని ఆయన తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా మేలో రిలీజ్ అవుతుందని దిల్ రాజు తెలిపారు.
previous post