28.2 C
Hyderabad
April 20, 2024 12: 29 PM
Slider జాతీయం

సిఎఎ ఫైర్:జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో ఇరువర్గాల ఘర్షణ

పౌరసత్వ సవరణ చట్టంపై గురువారం హింస చెలరేగడంతో జార్ఖండ్‌లోని లోహర్‌దగా పట్టణంలో 144 సెక్షన్ విధించారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కు మద్దతుగా కొన్ని హిందుత్వ సంఘాలు ర్యాలీని నిర్వహిస్తున్నప్పుడు గురువారం జరిగిన సంఘటనతో ఈదుస్థితి నెలకుంది.
ర్యాలీలో ఆమ్లాటోలి చౌక్ ప్రాంతానికి చేరుకోవడంతో దీనిపై మరో వర్గం వారు రాళ్ళు విసిరారు. దీనితో ఇరువర్గాల మధ్య దాడులు జరగగా దాడి తరువాత అనేక దుకాణాలు కాలిపోయాయి మరియు కొన్ని ద్విచక్ర వాహనాలకు నిప్పంటించారు. ఇది ఈ ప్రాంతంలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని నియంత్రించడానికి డిప్యూటీ కమిషనర్ ఆకాంక్ష రంజన్, పోలీసు సూపరింటెండెంట్ ప్రియదర్శి అలోక్ అక్కడికి చేరుకొని 144 సేసిన్ విధించారు.

ఈ ప్రాంతంలో పోలీసు సిబ్బందిని కూడా మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.సంఘటన తర్వాత లోహర్‌దాగలో సెక్షన్ 144 విధించినట్లు లోహర్‌దగా డిప్యూటీ కమిషనర్ ఆకాంక్ష రంజన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిస్థితిని నియంత్రించడానికి రంజన్, పోలీసు సూపరింటెండెంట్ ప్రియదర్శి అలోక్‌తో కలిసి ఉన్నారు.


ర్యాలీ నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఈ సంఘటన తర్వాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై విరుచుకుపడింది. సిఎఎ అనుకూల మద్దతుదారులపై కొందరు పెట్రోల్ బాంబులు, రాళ్ళు విసిరినట్లు విహెచ్‌పి ఆరోపించింది దీనిపై ప్రభుత్వ మద్దతుతోనే పోలీసులు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించారని వారు విమర్శించారు.

Related posts

తలసేమియా చిన్నారులకు రక్తం అందించిన జనచైతన్య ట్రస్ట్

Satyam NEWS

A.P ఉద్యోగస్తులకు “నవరత్న ఆయిల్” బహుకరణ!

Satyam NEWS

విద్యార్థుల జీవితాలు కలర్ ఫుల్ తో పాటు మీనింగ్ ఫుల్ గా ఉండాలి

Bhavani

Leave a Comment