32.2 C
Hyderabad
April 20, 2024 19: 17 PM
Slider ప్రత్యేకం

జాస్తి చలమేశ్వర్ కుమారుడికి కీలక పదవి ఇచ్చిన జగన్

#JasthiChalameswar

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పని చేసి పదవి విరమణ చేసిన జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగభూషణం ను నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదనపు అడ్వకేట్ జనరల్ గా నియమించింది.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన జాస్తి నాగభూషణం కు కీలక పదవి కట్టబెట్టడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర హైకోర్టులో, సుప్రీంకోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఈ నియామకం జరగడం కూడా గమనార్హం. జాస్తి చలమేశ్వర్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.

ఎన్నో అంశాలలో జాస్తి చలమేశ్వర్ ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తుంటారని చాలా మంది భావిస్తుంటారు.

జాస్తి చలమేశ్వర్ కుమారుడికి కీలక పదవి ఇవ్వడంతో ఇప్పుడు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ కేసులను వాదించే విధానం కూడా మారుతుందని అంటున్నారు.

Related posts

పునరావాసం కల్పించాలని కొండాయి గ్రామస్తుల వినతి

Satyam NEWS

జీవన విధానంలో స్వచ్ఛత మౌలిక సూత్రం

Bhavani

పంట కళం నిర్మాణ పనులు ప్రారంభించిన వ్యవసాయ అధికారి

Satyam NEWS

Leave a Comment