28.2 C
Hyderabad
June 14, 2025 11: 06 AM
Slider వరంగల్

ఫెసిలిటేషన్:భరతమాతకు ప్రతిరూపమే జవాన్

javan bharath matha same dcp nagaraj fecilitation

దేశం కోసం ప్రాణాలర్పించే వీర జవాన్లను సత్కరించడమంటే భరతమాతను సత్కరించడమేనని భరతమాత ప్రతిరూపాలు జవాన్లని వరంగల్​ గ్రామీణ జిల్లా డీసీపీ నాగరాజు అన్నారు.నడి కూడా మండలం పులిగిల్ల గ్రామంలో భారత సైనికుడు బొట్ల వేణుగోపాల్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా డిసిపి నాగరాజు మాట్లాడుతూ పులిగిల్ల గ్రామానికి చెందిన బిట్ల వేణుగోపాల్ భారత సైన్యంలో 17 సంవత్సరాలుగా సేవ సేవ చేసి రావడం గర్వంగా ఉందని అన్నారు

ప్రతి గ్రామంలో దేశ రక్షణ కోసం సైన్యంలో చేరాలని యువతకు పిలుపునిచ్చారు ఏ సి పి శ్రీనివాస్ మాట్లాడుతూ పులిగిల్ల గ్రామంలో యువత ఉద్యోగాల కోసం పోలీసు లైబ్రరీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు .గ్రామానికి చెందిన వివిధ రంగాలలో ఉన్న వారు అందరూ సహక రించాలని కోరారు .పులిగిల్ల గ్రామంలో అనాధ ఆశ్రమం ఏర్పాటు కోసం నల్ల స్వరూపారాణి సుధాకర్ రెడ్డి ఎకరం భూమి ఉచితంగా ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు గ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చిన వారిని డిసిపి నాగరాజు అభినందించారు

ఈ సన్మాన కార్యక్రమం లో పరకాల ఏసీపి శ్రీనివాస్, వివిధ శాఖల లో పనిచేసే గ్రామానికి చెందిన ఉద్యోగులు సుధాకర్ రెడ్డి స్వరూప రాణి,లక్ష్మీ నారాయణ,చంద్ర మోగిలి, సాంబశివుడు, ప్రగతి ఇన్ఫ డేవలపర్ ఛైర్మన్ ఇనుగాల సునీల్, కానిస్టేబుల్ లు ఓదెలు, రమేష్ పాల్గొన్నారు

Related posts

దేశ రాజకీయాలలో టెక్‌ ఫాగ్‌ యాప్ చిచ్చు

Sub Editor

చెంచుల అభివృద్ధికి పక్కాగా ప్రభుత్వ పథకాల అమలు

Satyam NEWS

విశ్లేషణ: లాక్ డౌన్ తో పెరుగుతున్న మానసిక వత్తిడి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!