విజయనగరం కేఎల్ పురం లో ఉన్న రామలక్ష్మణ ట్రెడర్స్ రైస్ మిల్లును జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులోని ధాన్యం నిల్వలను రికార్డులను సివిల్ సప్లైస్ డీఎం మీనా కుమారి తో కలిసి పరిశీలించారు. విద్యుత్ మీటర్, బిల్లులను తనిఖీ చేశారు. మిల్లింగ్ పై ఆరా తీశారు. బియ్యాన్ని శాంపిల్స్ తీసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ట్రక్ షీట్లు, గోనె సంచులపై ఆరా తీశారు. సమీపంలోని భారత ఆహార సంస్థ గోదాములను జేసీ పరిశీలించారు.
ఒక్కో గోదాములో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీశారు. తూకం పై ప్రశ్నించారు. తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అన్ని స్థాయిల్లోని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, ఎస్వోపి ప్రకారం తనిఖీలను నిర్వహించి, నివేదికలు పంపించాలని సూచించారు. అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేస్తామని జెసి హెచ్చరించారు
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లులు, చౌక ధరల దుకాణాలు, గోదాములు, ఎమ్మెఎల్ఎస్ పాయింట్లు, గ్యాస్ కంపెనీలు, ఎండియు వాహనాలను షెడ్యూల్ ప్రకారం తనిఖీచేయాలని జేసి సూచించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, ఎస్వోపి ప్రకారం తనిఖీలను నిర్వహించి, నివేదికలు పంపించాలని సూచించారు. అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేస్తామని జెసి హెచ్చరించారు.ఈ తనిఖీలలో సీఎస్ డిటి రామారావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.