35.2 C
Hyderabad
April 24, 2024 13: 34 PM
Slider విశాఖపట్నం

జేడీ లక్ష్మీనారాయణా? నీ అడుగులు ఎటు?

#JD Lakshminarayana

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అడుగులు ఏ వైపు పడనున్నాయి? 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున విశాఖ ఎంపీ గా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఓడిన కొన్ని రోజులు జనసేనలోనే ఉన్నారు.. ఐతే కొన్ని కారణాల వల్ల జనసేన ను వీడి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కి సంబందం లేకుండా సామాజిక కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలతో విశాఖ ప్రజలకు ఆయన టచ్ లోనే ఉంటున్నారు. ఐతే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జేడీ ఆలోచనలో పడ్డారు.

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందా అని సన్నిహితులతో చర్చలు జరిపినట్లు టాక్. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం కన్నా మీ భావజాల దగ్గర గా ఉండే పార్టీ లో చేరితే మీరు తప్పక విజయం సాధిస్తారు అని ఆయన సన్నిహితులు చెప్పినట్టు వినికిడి. ఐతే ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. జేడీ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీ ఏది అనే ప్రశ్న తలెత్తుంది. అధికార వైకాపా ఐతే జేడీ భావజాలానికి సరిపోదు అని సగటు విశాఖ వాసులకే కాదు రాజకీయ విజ్ఞానం ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది. కాబట్టి ఆయన వైకాపా లోకి వెళ్లే చాన్స్ లేదు.

గతంలో పోటీ చేసి ఓడిన జనసేన వైపు వెళ్లే ఆలోచన గతంలో చేసినా కూడా జేడీ ఎందుకనో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు తీయడం కరెక్టు కాదు అనేది జేడీ అభిప్రాయం.

సినిమాలు కాకుండా తనకు మరే వ్యాపారం లేదని, పార్టీని పోషించుకోవాలంటే తాను సినిమాల్లో నటించక తప్పదని పవన్ కల్యాణ్ వివరణ కూడా ఇచ్చుకున్నారు. అందువల్ల ఆయనకు జనసేన తలుపులు మూసుకుపోయినట్లే భావించాలి. అయితే మళ్ళీ జనసేన అధినేత పవన్ పిలిస్తే వెళ్లే చాన్స్ ఉంది అంటూ కొందరు చెవులు కోరుకుంటున్నారు. అయితే జేడీ మాత్రం ఎక్కడా ఓపెన్ కాలేదు. ఇక బీజేపీ లోకి జేడీ వెళ్తారు అని కాస్తా హడావిడి పుకార్లు షికార్లు చేసినా జేడీ వాటిని కొట్టి పారేశారు. ఇక మిగిలింది టీడీపీ ఒక్కటే.

తెలుగుదేశం పార్టీ కూడా జేడీ కి టచ్ లో ఉందని మరి కొందరు అంటున్నారు. ఇటీవలజేడీ ప్రెస్ మీట్ పెట్టి నేను విశాఖ నుండి పోటీ చేయడం ఖాయం… అది స్వతంత్ర అభ్యర్ధి గానా, ఏ పార్టీ అనేది త్వరలో చెబుతా అని.. చివర్లో తన భవజాలనికి దగ్గరగా ఉంటే పార్టీలోకి వెళ్తా అని హింట్ ఇచ్చారు. కానీ పైకి ఎక్కడా ఈ విషయాలను ధృవీకరించలేదు. ఐతే సగటు విశాఖ వాసులు మాత్రం జేడీ భావజాలానికి టీడీపీ యే సరైన వేదిక అని భవిస్తున్నారనేది ఇన్ సైడ్ టాక్. 2019 ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వల్లే జేడీ ఓడిపోయారు అనేది జగమెరిగిన సత్యం.

పైగా విశాఖ టీడీపీ కి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. 2019 లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన భారత్ ను ఈసారి ఎం.ఎల్.ఏ గా భీమిలి నుండి పోటీకి దించాలని భావిస్తున్నట్టు టాక్. అలాగే విశాఖ పార్లమెంట్ ఇంచారాజ్ గా ఉన్న పల్లా శ్రీనివాస్ గాజువాక నుండి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విశాఖ ఈస్ట్,నార్త్, సౌత్,వెస్ట్, భీమిలి, గాజువాక లో టీడీపీ బలంగా ఉండడం తో 6 నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉండడం, జేడీ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నేతకు టీడీపీ ఓటు బ్యాంక్ అండ ఉంటుందని, దీనితో జేడీ విజయం సులువు అవుతుందని అంటున్నారు. కాబట్టి జేడీ కి టీడీపీ యే సరైన వేదిక అని ఆయన సన్నిహితులు, విశాఖ వాసులు చర్చించుకుంటున్నారు. ఐతే జేడీ లక్ష్మీనారాయణ చెపితే గాని సెస్పెన్స్ కి తెరపడదు.

రామకృష్ణ పూడి, విశాఖపట్నం

Related posts

ఫాలో అప్: పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

పవన్ బలంపై ఆధారపడి గెలవాలనుకోవడం బిజెపి బలహీనత

Satyam NEWS

నియో cov వైరస్ పై అపోహలు నమ్మవద్దు

Satyam NEWS

Leave a Comment