27.7 C
Hyderabad
March 29, 2024 02: 04 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

బీటెక్ హరి చేశాడు పెద్ద సైజు కిరికిరీ

ys jagan56

నాయకుల పై అభిమానం ఉండటంలో తప్పులేదు. వారి గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వాదించి సరి చేయవచ్చు తప్పులేదు. అయితే నాయకుడి పేరు పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే మాత్రం… ఇదుగో…ఈ ముప్పిడి హరి రాకేష్ లాగా కటకటాలు లెక్కించాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును ఈ ముప్పిడి హరి రాకేష్ ఏకంగా తన కారుకే పెట్టుకున్నాడు. కారుకు ఒక నెంబర్ ఉండాలని, ఆ నంబర్ ను నిర్ణయించిన పరిమాణంలో నిర్ణయించిన ఫాంట్, సైజులో పెట్టుకోవాలని అతను మరచిపోయాడు. ఏకంగా కారుకు ఏపి సిఎం జగన్ అని నెంబర్ ప్లేట్ ప్లేస్ లో పెట్టేశాడు. దాంతో హరి రాకేష్ ను జీడిమెట్ల పోలీసులు పట్టుకుని కేసు పెట్టేశారు. హరి రాకేష్ బీటెక్ చదివాడు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం కు చెందిన ఇతను కూకట్ పల్లిలో నివాసం ఉంటాడు. జీడిమెట్లలో శివసాయి ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్నాడు. అతను నడుపుతున్న కారు ఏసు రెడ్డి అనే పేరుతో రిజిస్టర్ అయి ఉంది. దాని ఒరిజినల్ నెంబర్ ఏపి10 బిడి 7299. ఈ నెంబర్ పెట్టకుండా ఏపి సిఎం జగన్ అని పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకు బాబూ ఇలా చేస్తున్నావు అంటే ఇలా పెట్టుకుంటే ఏ టోల్ గేట్ దగ్గరా ఆపడంలేదట. పోలీసులు కూడా చెక్ చేయడం లేదట. ఎక్కడికి వెళ్లినా తనిఖీ చేయకుండా పంపిచేస్తున్నారట. అయ్యా అదీ సంగతి. నీ సంగతి ఇలా ఉందా అని జీడిమెట్ల ట్రాఫిక్ పోలీస్ ఇన్ స్పెక్టర్ సత్యనారాయణ అతడిపై ఐపిసి 420, 210 సెక్షన్ ల ప్రకారం కేసు పెట్టి అరెస్టు చేశారు.

Related posts

కరోనా ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

ఉత్సాహంగా శ్రీకాకుళం జిల్లా స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలు

Satyam NEWS

మార్గదర్శకులు టంగుటూరి ప్రకాశం పంతులు

Satyam NEWS

Leave a Comment