37.2 C
Hyderabad
March 28, 2024 19: 40 PM
Slider ప్రపంచం

Celebrations: నేడు జో బైడెన్ 78వ పుట్టిన రోజు

#Joe Biden

అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ నేడు 78వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించబోతున్న అత్యంత పెద్ద వయస్స్కుడు అయిన జో బైడెన్ జనవరి 20న అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

రోనాల్డ్ రీగన్ కు 1989లో అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే నాటికి 77 సంవత్సరాల 349 రోజుల వయసు ఉంది. జో బైడెన్ ప్రమాణ స్వీకారం నాటికే 78 ఏళ్ల వయసు దాటారు. అమెరికా ప్రస్తుతం ఆరోగ్య పరంగా అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉంది.

ప్రతి రోజూ మరణించే వారి సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కరోనా ఇప్పటిలో అదుపులోకి వచ్చే అవకాశం అక్కడ కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో జో బైడెన్ ప్రధమ ప్రాధాన్యం కరోనాను కంట్రోల్ చేయడమే అవుతుంది. ఈ దిశగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు.

కరోనా వ్యాధి కట్టడి తర్వాత అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య జో బైడెన్ ద్వితీయ ప్రాధామ్యంగా ఉంటుంది. ఆ తర్వాత పెరిగిపోతున్న జాతివైరం సమస్య మరో ప్రధాన సమస్యగా ఉంది. 78 ఏళ్ల వయసులో అసాధారణమైన ఈ మూడు సమస్యలను పరిష్కరించేందుకు జో బైడెన్ ముందుకు వస్తున్నారు.

Related posts

ప్రాణాలు కాపాడే ప్రత్యక్ష దైవాలు మన డాక్టర్లు

Satyam NEWS

ఆటో బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

Satyam NEWS

షబ్బీర్ అలీ దేశద్రోహి: ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

Satyam NEWS

Leave a Comment