37.2 C
Hyderabad
March 29, 2024 17: 26 PM
Slider తూర్పుగోదావరి

జెర్సీ ఆవుకు ఓకే కాన్పులో నాలుగు దూడలు

Jersey cow has four calves in OK weaning

ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు జరిగే అరుదైన సంఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన ఓ రైతు కమతంలో జరిగింది. జొన్నాడకు చెందిన నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి కమతం (గోశాల)లో గల ఓ జెర్సీ ఆవుకు అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ పశు వైద్యశాలలో 9 నెలల క్రితం పశు వైద్యుడు భాను ప్రసాద్ యదకు సంబంధించిన ఇంజెక్షన్ ఆవుకు ఇవ్వడంతో 9 నెలల అనంతరం ఆ ఆవు రెండు గిత్త దూడలు (మగ), రెండు పెయ్యి దూడల (ఆడ) లకు జన్మనిచ్చిందని, ఆ దూడలు జన్మించిన వెంటనే ఒక గిత్త దూడ బ్రతికి ఉండగా మిగిలిన మూడు దూడలు చనిపోయినట్లు తెలిపారు. ఏడు లక్షల ఆవుల్లో ఒక ఆవుకు ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకుంటుందని వైద్యుడు వెల్లడించారు. బ్రతికి ఉన్న గిత్త దూడ ఆరోగ్యకరంగా ఉందని ఆయన తెలిపారు.

Related posts

అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుంది

Satyam NEWS

ములుగులో నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

Writing a creative essay is onerous, nevertheless it is not going to have got to be

Bhavani

Leave a Comment