37.2 C
Hyderabad
April 19, 2024 13: 52 PM
Slider రంగారెడ్డి

బిఓసిడబ్ల్యు కార్డుతో భీమా సౌకర్యం

#Janasahas

భవన నిర్మాణ రంగంలో పని చెసే ప్రతి కార్మికుడు బిఒసిడబ్ల్యు ( లేబర్ )కార్డు పొందాలని జన్ సాహస్ సంస్థ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్ అన్నారు. సోమవారం  పరిగి మండల పరిధిలోని రూప్ ఖాన్ పేట్ గ్రామంలో స్థానిక సర్పంచ్ నరసింహా తో కలిసి బిఓసిడబ్ల్యు కార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా జన్ సాహస్ సంస్థ వికారాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పని చేసే కార్మికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. గుర్తింపు కార్డు ఉండటంతో ప్రభుత్వం ద్వారా ఇన్సూరెన్స్ కూడా పొందుతారని తెలిపారు.

ప్రభుత్వం ద్వార బిఒసిడబ్ల్యు కార్డు పొందినట్లయితే  కార్మికుల కుటుంబంలో ఇద్దరు కూతుళ్ల పెళ్లికి ఖర్చులకు రూ.30.000 (ముప్పైవేలు), ఇద్దరు కూతుళ్ల రెండు డెలివరీలకు  రూ.30.000 (ముప్పైవేలు), ప్రమాదవశాతు ప్రమాదంలో మరణిస్తే రూ.6లక్షల ప్రమాద భీమా ప్రభుత్వం అందిస్తుందని, శాశ్వత అంగవైకల్యం జరిగితే 5లక్షల భీమా , సహజ మరణానికి రూ.1.30.000 (లక్ష ముప్పైవేలు) రూపాయల ప్రభుత్వ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.

ఈ అవకాశాన్ని ప్రతి భవన నిర్మాణ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related posts

150 మంది పోలీసులతో మాజీ సీఎం కు బందోబస్తు…!

Satyam NEWS

సత్తెమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికీ అందాలి

Murali Krishna

ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. 64 మంది మృతి

Sub Editor

Leave a Comment