30.7 C
Hyderabad
April 19, 2024 09: 29 AM
Slider నల్గొండ

ఇంటికో ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగులారా ఆలోచించండి

#CITUHujurnagar

ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ వాగ్దానం మర్చిపోయి తన ఇంట్లోనే నాలుగు ఉద్యోగాలను పర్మినెంట్ చేసుకున్నాడని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి ఆరోపించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్రీ విద్యార్థులు ఓట్లని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, వామపక్షాలు బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డిని గెలిపించుకోని, ప్రశ్నించే గొంతును కాపాడుకోవాలని కోరారు.

నిరుద్యోగ యువత ఆలోచించి ఓటు వేయాలని కోరారు. వృద్ధాప్య పింఛన్ ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు ఉంటే ఒక్కరికి మాత్రమే పింఛన్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మాత్రం తన ఇంట్లో నాలుగు ఉద్యోగాలు చేయొచ్చా అని, ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలని అన్నారు.

ఒకపక్క కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ రైతుల వెన్ను విరిచే చట్టాలు తెస్తుందని,రాష్ట్రంలో ప్రజలను LRS ద్వారా నానా ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.

ఇదంతా చూస్తుంటే పెట్టుబడి దారులకు ఉపయోగపడే ప్రభుత్వాలు తప్ప ప్రజలకు ఏమాత్రం సహకారం చేసే విధంగా లేదని రోషపతి విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు యలక సోమయ్యగౌడ్, గుండెబోయిన వెంకన్న, కె.మధు, తిరుపతయ్య, సైదులు, నాగరాజు, మోహన్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

గృహా నిర్మాణ బకాయిలు చెల్లించకుంటే న్యాయ స్థానాలే దిక్కు

Satyam NEWS

పొంగులేటి, జూపల్లి లతో రేవంత్‌తో కీలక భేటీ?

Bhavani

ప్రముఖ నిర్మాత మురారి కన్నుమూత

Satyam NEWS

Leave a Comment