29.2 C
Hyderabad
November 4, 2024 19: 39 PM
Slider విశాఖపట్నం

ఏపీని పర్యాటకంగా అభివృద్ధి చేసే అవకాశాలు పుష్కలం

#bandisainjai

ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజిన్ పాలన కొనసాగుతున్నందున గతంతో పోలిస్తే ఏపీని రెట్టింపు స్థాయిలో అభివ్రుద్ది చేసుకునే అవకాశాలున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. రాజకీయాలను, పంతాలు, పట్టింపులను పక్కనపెట్టి అభివ్రుద్ధికి సహకరించాలని, తద్వారా ప్రజల ఆకాంక్షలను నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. ఏపీలో అనేక ప్రసిద్ధ ఆలయాలు, పర్యాటక ప్రదేశాలున్నందున పర్యాటక రంగంగా రాష్ట్రాన్ని అభివ్రుద్ధి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎన్ని విమర్శలొచ్చినా లెక్క చేయకుండా అనుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా అహర్నిశలు పనిచేస్తున్న మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని కొనియాడారు. మోదీ క్రుషి ఫలితంగా ఆర్ధిక ప్రగతిలో భారత్ 5వ స్థానానికి చేరుకుందన్నారు. 2028 నాటికి భారత్ మూడో స్థానానికి చేరుకోవడం తథ్యమన్నారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు 10 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయబోతోందని, ఇప్పటికే దాదాపు 8 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. ఈరోజు ఉదయం విశాఖపట్నంలో నిర్వహించిన ‘‘రోజ్ గార్ మేళా’’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ ఈ సందర్భంగా తన చేతుల మీదుగా 110 మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ భరత్, స్థానిక మేయర్, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు….. ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచనల మేరకు, వారి క్రుషివల్ల అనేక మంది యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ధ్రుఢ సంకల్పంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తున్నారు. అందులో భాగంగా వైజాగ్ లో జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. కొత్తగా అపాయిట్ మెంట్ లెటర్లు తీసుకుంటున్న వారందరికీ నా అభినందనలు. 2022 అక్టోబర్ లో రోజ్ గార్ మేళా ప్రారంభమైంది.

విశాఖపట్నం లొకేషన్‌లో 110 మంది అభ్యర్థులు ఈరోజు అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోదీ ప్రకటించారు. ఇచ్చిన మాట మేరకు ఇప్పటి వరకు 8 లక్షల మందికి అపాయిట్ మెంట్ లెటర్లు ఇచ్చారు. పైరవీలకు తావు లేదు. నోటిఫికేషన్ల పేరుతో జాప్యం చేయడం లేదు. అవినీతి ఆరోపణలు లేకుండా నిర్ణీత గడువులోగా రిక్రూట్ మెంట్ నిర్వహించి పరీక్షల ప్రక్రియను పూర్తి చేసి నియామక పత్రాలు అందజేస్తున్నం.  ఏ విభాగంలోనైనా ఖాళీలుంటే ఆ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 

ఆ పరిస్థితి రాకూడదనే వెంటవెంటనే భర్తీ చేస్తున్నాం. మోదీగారి ప్రధాని కాకముందు ప్రపంచ ఆర్దిక ప్రగతిలో మనదేశం 11వ స్థానంలో ఉండేది. 1990వ దశకంలో దేశం అప్పుల్లో కూరుకుపోయి బంగారం నిల్వలను కుదవపెట్టిన దుస్థితి. మోదీ గారి అద్బుతమైన పాలనా దక్షతవల్ల ఇయాళ 5వ స్థానంలోకి అడుగుపెట్టాం. మరో 4 ఏళ్లలో అంటే 2028 నాటికి  ఆర్ధిక ప్రగతిలో భారత్  మూడో స్థానానికి చేరుకుని అమెరికా, చైనాతో పోటీ పడాలనే ముందుకు సాగుతున్న మహానుభావుడు నరేంద్రమోదీ.‘ఆత్మనిర్బర భారత్’’ అంటే మన దేశం అన్ని రంగాల్లో స్వయం సమ్రుద్ధి సాధించడమే కాకుండా ప్రతి ఒక్కరూ తమ కాళ్లపై తాము నిలబడటమే. ఆత్మ నిర్భర భారత్.

కరోనాతో ప్రపంచమంతా వణికిపోయింది.అమెరికా వంటి అగ్రదేశం కూడా ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. అక్కడి ప్రజలు ఆర్దికంగా చితికిపోయారు. కానీ మోదీ గారి దూరద్రుష్టితో ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసింది.  ఏ వర్గాలైతే ఉద్యోగాల కోసం అర్రులు చాచాయో… ఆ వర్గాలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని స్టాండప్ ఇండియా ఏర్పాటు చేశారు. స్టార్టప్ ఇండియా, మేక్ ఇండియా పేరుతో  వ్యవసాయం, ఐటీ, పరిశ్రమలు, ఈ కామర్స్, ఎంఎస్ఎంఈ, సాంప్రదాయ ఇంధన, సేవా రంగాల్లో అగ్ర దేశాలతో పోటీ పడేలా దూసుకుపోతున్నం.

నిత్య కృషీవలుడు నరేంద్ర మోడీ

ఎన్ని విమర్శలొచ్చినా అధిగమిస్తూ నిర్ణీత లక్ష్యాల కోసం పనిచేస్తున్న క్రుషీవలుడు నరేంద్రమోదీ. కోవిడ్ టైంలో ఎంత ఇబ్బందికర పరిస్థితి వచ్చిందో తెలుసు. అమెరికావంటి అగ్రరాజ్యాలు వణికిపోయాయి. చితికిపోయాయి. కానీ ఆత్మనిర్భర భారత్ తో స్వయం సమ్రుద్ధి సాధించే స్థాయికి తీసుకొచ్చారు.  మోదీ గారి విజన్ వల్ల వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. మన దేశ జనాభాకు సరిపడ వడ్లు పండించడంతోపాటు విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే స్థాయిలో ఉన్నం. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా మారింది.  ఒకప్పుడు చక్కెర దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసుకునే వరకు వెళ్లినం. నిత్యావసర వస్తువులన్నీ ఎగుమతి చేసే స్థాయికి వచ్చాం… దటీజ్ ఆత్మ నిర్బర భారత్.

గతంలో జన్ ధన్ ఖాతాలను ప్రారంభిస్తే…చదువురాని వాళ్లతో బ్యాంకు అకౌంట్లు ప్రారంభిస్తే ప్రయోజనం ఏముందని హేళన చేశారు. కానీ సంక్షేమ పథకాల లబ్ది నేరుగా వారికే అందుతున్నాయి. గతంలో సంక్షేమ పథకాల పేరుతో రూపాయి పంపిస్తే…లబ్దిదారుడికి 15 పైసలు మాత్రమే చేరివి. 85 పైసలు అవినీతి జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. వందశాతం సద్వినియోగం అవుతోంది. ముద్రా లోన్ తో ఎంతో మంది స్వయం ఉపాధి పొందుతున్నరు. 20 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తున్నం. 

ముద్రా లోన్ లను అపహాస్యం చేసిన వారే ఇప్పుడు పొగుడుతున్నారు

ముద్రా లోన్ తీసుకుని ఏం చేయాలే… చదువుకున్నోళ్లు ఇడ్లీ, దోశ బండ్లు, మిర్చి బండ్లు పెట్టుకోవాలా? అని హేళన చేసిన వాళ్లంతా ఇయ్యాల ముద్ర లోన్లతో బాగుపడ్డ ఎన్నో కుటుబాలను చూసి ఆశ్చర్యపోతున్నయ్. ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈపీఎఫ్ సంస్థలో ప్రతి ఏటా 20 నుండి 40 లక్షల మంది కొత్తగా రిజిస్టర్ అవుతున్నారు. పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తోంది. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు. ఆ తరువాత అభివ్రుద్ధే నరేంద్రమోదీ లక్ష్యం. అందులో భాగంగానే ఏపీకి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు.

పెద్ద ఎత్తున నిధులిస్తున్నారు.  ముఖ్యంగా ఇచ్చిన హామీ మేరకు విజయనగరంలో ట్రైబల్ యూనివర్శిటీ….మంగళగిరిలో ఎయిమ్స్, తిరుపతిలో ఐఐటీ, ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేసినం.  వైజాగ్ లో ఐఐఎం, ఐఐపీఈ(ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ)ను ఏర్పాటు చేసుకున్నం. అనంతపురంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నం. రాష్ట్రంలో కొత్తగా ఏకంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేసినం. 7 ఈఎస్ఐ ఆసుపత్రుల నిర్మాణానికి, 3 ఈఎస్ఐ ఆసుపత్రుల పునర్నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేసినం. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా దాదాపు రూ.13,500 కోట్లు కేంద్రం ఇప్పటి వరకు మంజూరు చేసింది.

అమరావతి డెవలెప్ మెంట్ కోసం రూ.15000 కోట్లు ఇవ్వబోతున్నం. ఇప్పటికే 3 వేల కోట్లు విడుదల చేసినం. కేంద్ర భాగస్వామ్యంతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసుకోబోతున్నం. భూసేకరణ అయ్యే ఖర్చులో కేంద్ర రాష్ట్రాలు సగం సగం భరించాలి. కానీ రాష్ట్ర పరిస్థితి ద్రుష్ట్యా పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. నేషనల్ హైవేస్ విశాఖపట్నం రాయపూర్ ఎక్స్ ప్రెస్ హైవే… ఇదో గేమ్ ఛేంజర్. ఇది పూర్తయితే వైజాగ్ రూపరేఖలే మారతాయి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకోవడంతోపాటు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భద్రాచలం -కొవ్వూరు, కాళహాస్తి-నడికుడి, కోటిపల్లి-నర్సాపురం, రాయదుర్గం- రాయచూర్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నిధులిస్తోంది.

విమానయాన రంగం విషయానికొస్తే…. ఆ శాఖ మంత్రి ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తే. భారీ ఎత్తున విమానాశ్రయాల అభివ్రుద్ధికి క్రుషి చేస్తున్నరు. తిరుపతి, వైజాగ్, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివ్రుద్ధి చేసే పనిలో ఉన్నరు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనుమతి లభించింది. విమానాశ్రయాల్లో మౌలిక వసతుల కోసమే వెయ్యి కోట్లకుపైగా ఖర్చు చేసినం. స్మార్ట్ సిటీ పథకం కింద విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, అమరావతి నగరాల అభివ్రుద్ధి కోసం దాదాపు 8 వేల కోట్ల రూపాయలకుపైగా నిధులు మంజూరు చేసింది.

మొన్నటి కేబినెట్ లోనే మొన్ననే అమరావతి మీదుగా రైల్వే లైన్ నిర్మాణానికి 2వేల 200 కోట్ల నిధులు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నం. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. దీనివల్ల గతంతో పోలిస్తే రాష్ట్రాన్ని రెట్టింపు స్థాయిలో అభివ్రుద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఏపీ అభివ్రుద్ధికి మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. నా విజ్ఝప్తి ఒక్కటే… రాజకీయాలు, పగలు, పంతాలు, పట్టింపులను వదిలిపెట్టి అందరూ కలిసి పనిచేస్తే ఏపీ ప్రజలు కలలుగనే అభివ్రుద్ధి జరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.

Related posts

బెయిల్ నిబంధనలను జగన్ అతిక్రమిస్తున్నారు

Satyam NEWS

మార్చి 28 29 తేదీల్లో సమ్మె

Sub Editor 2

డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

Satyam NEWS

Leave a Comment