30.7 C
Hyderabad
April 19, 2024 10: 07 AM
Slider ముఖ్యంశాలు

మహబూబ్ నగర్ లో ఒకేషనల్ విద్యార్థుల అప్రెంటిస్షిప్ జాబ్ మేళా

#jobmela

మహబూబ్ నగర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల లో ఈ నెల 30న నిర్వహించే అప్రెంటిస్షిప్ జాబ్ మేళా కు ఎక్కువ మంది విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి జి.వెంకట రమణ కోరారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ మరియు ఒకేషనల్  లెక్చరర్స్ సమావేశం నిర్వహించి , జాబ్ మేళా విజయవంతం చేసేందుకు కొన్ని సూచనలు చేస్తూ అవగాహన కల్పించారు.

గత మూడు సంవత్సరాల నుండి ఉత్తీర్ణత సాధించిన ఒకేషనల్ కోర్సుల విద్యార్థిని, విద్యార్థులు ఈ జాబ్ మేళా కు అర్హులని, వారికి వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి, జాబ్ మేళాకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. కళాశాలలో సంబంధిత కోర్సులు ఉపాధి అవకాశములు సంబంధిత కార్యాలయాలు, ఫ్యాక్టరీలు, వివిధ కంపెనీలు, డిపార్ట్మెంట్స్ లను నిర్ణీత ఫారంలో జాబ్ మేళాకు నమోదు చేయించాలని, ఖాళీల సంఖ్య సేకరించాలని అన్నారు.

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని, విద్యార్థులు ఇంటర్ మెమో తోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఐదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ మహబూబ్నగర్ కు 30 తారీకు రోజు హాజరయ్యే విధంగా సమాచారం ఇచ్చి , అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాల లో పని చేయు అధ్యాపకులు ప్రతి గ్రూపు నుండి ఒక అధ్యాపకుడు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల మహబూబ్ నగర్ కు 30వ తేదీ 9 గంటల వరకు చేరుకొని నిర్దేశించిన విధులు నిర్వహించాలన్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఒకేషనల్ విద్యార్థులను హాజరయ్యే విధంగా శ్రద్ధ తీసుకొని విద్యార్థులకు సంబంధిత కంపెనీలు, శాఖలలో ప్లేస్మెంట్స్ వచ్చే విధంగా కృషి చేసి ఒకేషనల్ విద్యను బలపరచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డి.రాజశేఖర్ , సుప్రజాత ఒకేషనల్ అధ్యాపకులు భగవేణి నరసింహులు, మదన్ మోహన్ రెడ్డి, రవిప్రకాష్, రాజయ్య, వెంకట్ రెడ్డి శ్రీనివాస రెడ్డి, మధుసూదన్, కేజీబీవీ కళాశాల ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు, ప్రైవేటు జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్  శిరిడీసాయి ఒకేషనల్ జూనియర్ కళాశాల నాగర్ కర్నూల్ కరస్పాండెంట్ సైదులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

నా భర్త ప్రాణాలను కాపాడండి…

Bhavani

వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని రథోత్సవం

Satyam NEWS

సిఐ అర్జున్ నాయక్ పై ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ లో కేసు

Satyam NEWS

Leave a Comment