37.2 C
Hyderabad
March 29, 2024 17: 16 PM
Slider ఆధ్యాత్మికం

జోగులాంబ జాతర రాష్ట్రానికి ఆదర్శం కావాలి

#Jogulamba Seva Samiti

ఈనెల 26వ తేదీ వసంత పంచమి సందర్భంగా గద్వాల జిల్లా అలంపురంలో జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి జోగులాంబ జాతర రాష్ట్రానికి ఆదర్శం కావాలని జోగులాంబ సేవ సమితి అధ్యక్షులు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం అలంపూర్ పట్టణంలోని టూరిజం హోటల్లో జోగులాంబ సేవా సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు అనంతరం అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జోగులాంబ జాతర విజయవంతం పై పలు విషయాలను వెల్లడి చేశారు. జోగులాంబ జాతర ద్వారా పట్టణ ప్రజలు గ్రామ ప్రజలు ఐక్యత రాగానే చాటి వారికి ఉన్నటువంటి భక్తిని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఇదే అని అన్నారు.

ఎప్పటిలాగే జోగులాంబ సేవ సమితి ఆధ్వర్యంలో గంటల శివాలయం నుండి జాతర ప్రారంభమవుతుందని భక్తులు గ్రామస్తులంతా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సేవా సమితి ఉపాధ్యక్షులు బండారి వెంకన్న బాబు మాట్లాడుతూ జోగులాంబ సేవా సమితి ఆవిర్భావం సేవా సమితి ఆధ్వర్యంలో దేవస్థానం ఆస్తుల పరిరక్షణకు సేవాసమితి కృషి చేసిన పలు అంశాలను వారు తెలియజేస్తూ జోగులాంబ జాతర అంటే మన ముఖ్యమైన పండుగ అనే విధంగా ప్రతి గడప నుండి ప్రతి భక్తుడు తరలివచ్చి ఈ ఆ యాత్రలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని అన్నారు.

ప్రచార కార్యదర్శి సంజీవ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించేటువంటి జోగులాంబ జాతర గత 8 సంవత్సరాల నుండి నిర్వహించబడుతుందని ప్రతి ఏటా ఎంతో అభివృద్ధి చెందుతూ భక్తులు యాత్రలో వేలాది సంఖ్యలో పాల్గొంటున్నారని చెప్పారు. సేవా సమితి ముఖ్య బాధ్యులు మరియు దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ ఏజీ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన జోగులాంబ జాతరకు ఆలయాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని గుర్తు చేశారు ఇప్పటిదాకా జోగులాంబ జాతరను జోగులాంబ సేవా సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు తన సొంత ఖర్చుతో నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు.

దేవస్థానానికి ఆదాయ వనరులు మెండు గా ఉన్నాయి కాబట్టి ఈ జోగులాంబ జాతర నిర్వహించే బాధ్యత ఇకపై దేవస్థానం తన భుజస్కందాల పై వేసుకోవాలని ఈ విషయాన్ని త్వరలోనే ఆలయ కమిటీ, దేవాదాయ శాఖ కమిషనర్ మరియు మంత్రి దృష్టి కూడా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఈ గ్రామస్తులపై ఉందని గుర్తు చేశారు. సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఆనంద్ శర్మ మాట్లాడుతూ జోగులాంబ జాతరలో పాల్గొనే భక్తులు ఎలాంటి మంగళ ద్రవ్యాలను తీసుకొని రావాలి అనే విషయాన్ని వివరించారు.

అదేవిధంగా జోగులాంబ ఆలయ శకటాన్ని ఆదిలాబాద్ టు అలంపూర్ కు ప్రచార రథయాత్రగా తీసుకువచ్చే కార్యక్రమాన్ని త్వరలోనే జోగులాంబ సేవ సమితి చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కేకే సత్యం, వెంకటేశ్వర్లు, బుజ్జి ,వెంకటేష్, ప్రశాంత్ ,నారాయణ ,సుంకన్న నాయుడు తదితరులు ఉన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యంగా ఖమ్మం పోలీసుల ప్రణాళిక

Satyam NEWS

రాష్ట్ర కార్యాలయంగా విశాఖ పార్టీ కార్యాలయం

Murali Krishna

ఎల్లూరు భూనిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమం

Satyam NEWS

Leave a Comment