35.2 C
Hyderabad
April 24, 2024 11: 06 AM
Slider వరంగల్

ఓపెన్ స్కూల్ విద్య ను సద్వినియోగం చేసుకోవాలి

#OpenSchool

పాఠశాల విద్య అందుబాటులో లేని వారికి, మధ్యలో బడి మానేసిన వారికి, గృహిణులకు, వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఓపెన్ స్కూల్ విద్యా విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి కార్యదర్శి ఎన్నెమ్ విజయమ్మ సూచించారు.

 మంగళవారం జిల్లా కేంద్రంలోని ఉమ్మడి పరీక్షల మండలి కార్యాలయంలో ఓపెన్ స్కూల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉన్న గృహిణులు, మధ్యలో బడి మానేసిన వారు, పాఠశాల విద్య అందుబాటులో లేని వారు జిల్లాలోని వివిధ ఉన్నత పాఠశాలల్లో, జూనియర్ కళాశాలల్లో ఉన్న ఓపెన్ స్కూల్ కేంద్రాలలో సంప్రదించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరి దూర విద్యను పూర్తి చేయాలని కోరారు.

జిల్లా అకడమిక్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ విద్య లో చేరిన ప్రతీ ఒక్కరు సెలవులలో జరిగే తరగతులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముదురు రమేష్, రమాదేవి, పోరిక సర్వన్ కుమార్, శిరుప సతీష్ కుమార్, రజిత,  యాసం విక్రమ్ కుమార్, కట్ల సంపత్ మరియు శివనాధుని శారద పాల్గొన్నారు.

జిల్లాలోని ఓపెన్ స్కూల్ కేంద్రాలు

1. బాలుర ఉన్నత పాఠశాల, ములుగు లో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

2. అబ్బాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

3. ములుగు జూనియర్ కళాశాలలో ఇంటర్ సైన్స్ మరియు ఆర్ట్స్ గ్రూప్

4. చల్వాయి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

5. ఇందిరా నగర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

6. ఏటూరునాగారం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

7. వెంకటాపురం(నుగూరు) ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

8. కమలాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్

9. మంగపేట ఉన్నత పాఠశాలలో పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్.

ప్రైవేట్ (పదవ తరగతి మరియు ఇంటర్ ఆర్ట్స్ గ్రూప్):

1. కాకతీయ ఉన్నత పాఠశాల, ములుగు

2. శ్రీ అరవింద ఉన్నత పాఠశాల, ములుగు

3. సెంట్ మేరీ ఉన్నత పాఠశాల, పస్రా.

Related posts

ఒక్కసారిగా కుప్పకూలిన గోల్డ్ మైన్.. 18 మంది మృతి

Sub Editor

పురుగుల మందు తాగి మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

… అందుకే సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పా

Satyam NEWS

Leave a Comment