27.7 C
Hyderabad
April 26, 2024 04: 57 AM
Slider కృష్ణ

సీనియర్ జర్నలిస్ట్  అంకబాబు అరెస్టు అక్రమం

#chandrababu

సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. వాట్స్ యాప్ లో ఒక వార్తను ఫార్వర్డ్ చేసిన కారణం గానే అరెస్ట్ చెయ్యడాన్ని ఆయన తప్పు పట్టారు. అక్రమ కేసులు, అరెస్ట్ లతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు.

73 ఏళ్ల వయసున్న ఒక జర్నలిస్ట్ ను అరెస్ట్ చెయ్యడం జగన్ ఫాసిస్ట్ మనస్తత్వాన్ని చాటుతుంది అని చంద్రబాబు అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుబడిన విషయం వాస్తవం కాదా…ఆ వార్తను ఫార్వర్డ్ చేస్తే తప్పు ఏంటి అని చంద్రబాబు ప్రశ్నించారు. వెంటనే అంకబాబు ను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.

Related posts

దళితుడిని చెపుతో కొట్టిన సర్పంచ్ పై చర్య తీసుకోవాలి

Satyam NEWS

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్?

Satyam NEWS

ప‌దిమంది చ‌ల్ల‌గా ఉండ‌టం కోసం…చ‌లి వేంద్రం ప్రారంభం…!

Satyam NEWS

Leave a Comment