30.7 C
Hyderabad
April 17, 2024 00: 48 AM
Slider ముఖ్యంశాలు

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

#Journalist Bhagawan Reddy

జర్నలిజం ఇది పవిత్రమైన వృత్తే కాదనం. కానీ నమ్మకమైన వృత్తి కాదు. బతుకు కు భరోసానిచ్చే వృత్తి అంతకంటే  కాదు.  ప్లీజ్ నమ్మొద్దు జర్నలిజంలోకి ఎవ్వరూ రాకండి వచ్చి ఇలా కాకండి అంటూ పేస్ బుక్ లో కొందరు జర్నలిస్ట్ మిత్రులు పెట్టిన  పోస్ట్ చూసి మనసు ద్రవించింది. గుండెల్లో ఏదో పెట్టి కెలికినట్లయింది.

పోస్ట్ లో పెట్టినట్లు ఒక్క భగవాన్  రెడ్డి దే కాదు  తెలుగు రాష్ట్రాల్లో పని చేసే  75  శాతం  జర్నలిస్టుల బతుకులు అంతే. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న జర్నలిస్టులు తమ బతుకులు వెళ్లదీయడానికి లోలోపల పడుతున్న అంతర్మధనానికి నిలువెత్తు సాక్ష్యమే ప్రకాశం  జిల్లా మార్కాపురం పత్రిక విలేకరి భగవాన్ రెడ్డి మరణం.

పక్కా బిజినెస్ గా మారిన జర్నలిజం

ఒక నాడు విలువల కోసం కొందరు ఎంచుకున్న పవిత్రమైన జర్నలిజం వృత్తి నేడు పక్కా బిజినెస్ గా మారి కొందరి  ప్రాణాలు హరించి వేస్తున్నది. ఒకరిని చూసి ఒకరు సమాజం లో ఏదో విలువను పొందాలని వచ్చి అటు బతకలేక ఇటు చావ లేక త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడే దుస్థితి.

మొదట బాగానే ఉన్న ఈ వృత్తిలో పోటీతత్త్వం పెరగడంతో పాటు యాజమాన్యాలకు ఊర పందులకు ఏదో తిన నేర్పినట్లుగా కొందరు తమ పలుకుబడిని పెంచుకోవడానికి,  ఉద్యోగాలను కాపాడుకోవటానికి ఊడిగం చేస్తుంటారు. తమ సంస్థ పేరు చెప్పి బాగా డబ్బు సంపాదిస్తున్నారని సాటి జర్నలిస్టులపైనే యాజమాన్యాలకు ఎక్కిస్తుంటారు.

ఈ రెండు కారణాలతో అంటే విలేకరులు సంపాదించుకుంటున్నారని, తమ సంస్థ లేకపోతే వీరికి బతుకే లేదని అనుకుంటూ యాజమాన్యాలు విలేకరులనే అన్ని పనులకు ఉపయోగిస్తుంటారు. దీంతో వృత్తి మీద ప్రేమతో వచ్చిన జర్నలిస్టులకు కష్టాలు మొదలవుతాయి.

విలేకరి అంటే పైరవీలు చేయాల్సిందే

విలేకరులందరూ పైరవీలే చేయాలి అనే స్థాయిలో యాజమాన్యాలు కూడా ఆలోచిస్తున్నాయి. వార్తలు రాసే పనికి ప్రాధాన్యత తగ్గించి అడ్వర్టైజ్మెంట్, సర్క్యూలేషన్,ప్రింటింగ్ అనే డిపార్ట్మెంట్లు ఉండగా కూడా విలేకరులతోనే అన్ని పనులు చేయిస్తున్నారు.

మండల స్థాయి నుండి ఎడిషన్ స్థాయి వరకూ సంవత్సర చందాలు, అడ్వర్టజ్మెంట్ టార్గెట్లు పెట్టి జర్నలిస్టులను బతికున్నప్పుడే మానసికం గా చంపుతున్నారు. చందాలు కట్టడానికి అప్పులు చేసి, అడ్వర్టయిజ్ మెంట్ల టార్గెట్లు పూర్తి జేయడానికి నాయకులను అడిగితే వారు మమ్ములను బెదిరిస్తున్నాడని జిల్లా ఇంఛార్జులకు  డబ్బులిచ్చి చేసిన  ఫిర్యాదులకు ఉద్యోగాలు తీసేసిన సందర్భాలు కోకొల్లలు. 

జీతం ఇవ్వడం కాదు…మనమే ఎదురు కట్టాలి

ఒకటి రెండు పత్రికలూ ఛానల్ లు మినహా  వృత్తిలో చేరినప్పుడే తాము జీతాలు ఇవ్వమని బాహాటం గా చెబుతున్న సంస్థకు నెల వారి  చెల్లించాలని చెబుతున్న ఏదో సాధిస్తామని జర్నలిస్టులు గా మారి ఆయా సంస్థల్లో చేరుతూ  పేరు గొప్ప ఊరు  దిబ్బలా  బాకీలు చేస్తూ  ఆ డబ్బులు చెల్లిస్తూ బయట గల్లాలు  ఎగర వేసి ఇంట్లో భార్య పిల్లను పస్తులుంచే జర్నలిస్ట్ మిత్రులు ఎంతో మంది ఉన్నారు.

ఈ సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన విలేకరులు ఉన్నారు. కొన్ని సార్లు వృత్తిలో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వీరు ఉండగా మరి కొంత మంది మంచానికి పరిమితమై మందులకు తిండికి పైసలు లేక నరక యాతన అనుభవిస్తున్న వారు ఎందరో. అలాంటి దే మన భగవాన్ రెడ్డి మరణం.

ఒక భగవాన్ రెడ్డి కథే కాదు ఇది

ఆంధ్ర జ్యోతిలో  విలేఖరి గా పని చేస్తూ రెండేళ్ల క్రితం ఒక కార్యక్రమం కవర్ చేయడానికి వెళ్లి వస్తూ చిన్న ప్రమాదం జరగగా తలకు దెబ్బ తగిలి డబ్బుల్లేక వైద్యులకు చూపించుకోలేక పోవడం తో మెదడు లో రక్తం గడ్డ గట్టి  ఓ ఏడాదికి బుర్ర పనిచేయక పిచ్చివాడైపోయాడు.

అలాగే సంవత్సర నుండి వేదన అనుభవిస్తూ  ఇదుగో ఇట్లా ఇవాళ కన్నుమూయడం తో ఏంతో మంది జర్నలిస్టుల బతుకు చిత్రం కళ్ళకు కట్టినట్లై కళ్ళ నుండి నీళ్లు రాలాయి. తోటి జర్నలిస్ట్ గా అతడు అనుభవించే జీవితమే మాది అయినా యాజమాన్యాలు పట్టించుకోవు.

యూనియనులు సాయం చేయవు అని తెలిసిన అదే వృత్తి ఎందుకంటే ఒక సారి ఈ వృత్తిలో అడుగు పెడితే ఇంకో వృత్తి  చేపట్టేందుకు  మనసు ఒప్పదు. ఈ వయసులో ఇప్పుడు కూలీకి పోయే పరిస్థితి లేదు. మా బతుకులిలా అయ్యాయనే మీకు చెబుతున్నాం దండం పెట్టి ప్లీజ్ జర్న లిజంలోకి ఎవరూ రావొద్దు. ఈ కష్టాలు పడొద్దు…

గుమ్మడి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్ట్

Related posts

పోలీస్ వ్యూ: రాజధాని లో పోలీసుల ఆంక్షలు డ్రోన్ల సాయంతో పహారా

Satyam NEWS

అటవీ భూముల ఆక్రమణ కుదరదు

Murali Krishna

రాత్రి సమయంలో రోడ్ల పైకి విజయనగరం లేడీ పోలీస్..!

Satyam NEWS

Leave a Comment