39.2 C
Hyderabad
April 25, 2024 16: 27 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా కేంద్రంలో జర్నలిస్టు భవన్ నిర్మాణం

#MinisterNiranjanReddy

వనపర్తి  జిల్లా కేంద్రంలో అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా జర్నలిస్టు భవన్ నిర్మించి ఇస్తామని, అందులో డిజిటల్ లైబ్రరీ, అధునాతన వసతులు ఉండే విధంగా తీర్చిదిద్దుకుందామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో గురువారం టీయూడబ్ల్యూజే ( ఐజేయూ) 2021 డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంత గొప్పగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని.. అందుకే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నానని అన్నారు.

 మొదట వనపర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రెస్ క్లబ్ లు, తర్వాత జిల్లాలోని  ప్రెస్ క్లబ్ లను స్థలం ఎంపిక చేసిన వెంటనే నిర్మించడం కోసం తాను రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తానన్నారు. ఇప్పటి నుంచి సంవత్సరంలోపు ఈ పనులన్నీ పూర్తయ్యే విధంగా పనిచేస్తానని అన్నారు.

డబుల్ బెడ్ రూం విషయంలో బీపీఎల్ కోటా ప్రకారంగా జర్నలిస్టుల భార్యల పేరుతో అందజేస్తామని..ముందే చెప్పిన విధంగా ఒక్కో చోట కొందరికి ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. అన్ని మండలాల్లో డబుల్ బెడ్ రూంలు నిర్మించినప్పుడు అక్కడి జర్నలిస్టులను అకామిడేట్ చేస్తామన్నారు.

ఇక ఎక్కువ శాతం పేద జర్నలిస్టులే ఉన్న కారణంగా వారికి కార్పొరేషన్ రుణాల ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తామని చెప్పారు. ఇవన్ని హామీలు మాత్రమే కాదని.. ఆచరణలో చేసి చూపిస్తానని అన్నారు.  ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న  ప్రెస్ క్లబ్  భవనాలను  పునర్నిర్మాణం చేస్తామని తెలిపారు.

వచ్చే ఏడాది 2022 యూనియన్ డైరీలు తామే ముద్రించి ఇస్తామని అన్నారు.  అయితే తాను పనుల ఒత్తిడిలో ఉంటానని వెంటపడి హామీల అమలును గుర్తు చేయాలని అని కోరారు అంతకుముందు టీయూడబ్ల్యూజే వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుండ్రాతి మధు గౌడ్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

జీతాలు లేకున్నా అంకిత భావంతో పనిచేస్తున్న జర్నలిస్టులు

ఒక్కో సమస్యను ఆయన ఏకరువు పెట్టారు.  ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమాజం కోసం కలం పట్టి పనిచేస్తున్నారని అన్నారు. జీతాలు లేకపోయినా జీవితాలను వృత్తి కోసం అంకితం చేస్తున్నారని అన్నారు వృత్తిలో అనేక ఇబ్బందులు ఒత్తిడులు ఎదుర్కొంటున్నారని దృష్టికి తెచ్చారు.

గత ఎన్నికల్లోనూ జర్నలిస్టులు పూర్తిస్థాయి సహకారం అందించాలని దాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నామని పెద్దదిక్కుగా సమస్యలు పరిష్కరించాలని గుర్తు చేశారు.  తాము నిజాయితీగా పనిచేస్తున్నామని మాట మార్చమని అన్నారు. ముందు ఒకటి వెనుక ఒకటి మాట్లాడేది లేదని స్పష్టంగా వివరించారు.

వనపర్తి లో జర్నలిస్టు భవన్ కావాలనేది చిరకాల కోరికని దృష్టికి తెచ్చారు అదేవిధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులకు ఇవ్వాలని కోరారు నిరుద్యోగంతో జర్నలిస్టులు బాధపడుతున్నారని వారికి వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇవ్వాలని ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రిని కోరారు. 

ప్రతి మండలంలో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించి ఇవ్వాలని కోరారు. తమది రెండు వందల ఎనభై మంది సభ్యులు గల అతిపెద్ద సంఘమని.. తమ  సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని కోరారు.  డైరీ ఆవిష్కరణ  కార్యక్రమంలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీందర్ రెడ్డి, పోలిశెట్టి బాలకృష్ణ, స్టేట్ కౌన్సిల్ సభ్యుడు సాక్షి రమేష్, ప్రదాన కార్యదర్శి ప్రశాంత్, ఐజేయు మాజీ సభ్యులు మల్యాల బాలస్వామి, 

ఉమ్మడి జిల్లా  ఉపాధ్యక్షుడు కొండన్నయాదవ్, సీనియర్ జర్నలిస్టులు పి. ఊషన్న, పౌర్ణ రెడ్డి, సూర్య మాధవరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్, వహీద్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవికాంత్, భాస్కర్ యాదవ్, జర్నలిస్టులు కుమార్,దినేశ్,మణ్యం, అంజి, ఫరూఖ్ పటేల్, సురేష్,  జిల్లాలోని వివిధ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు డైరీ ఆవిష్కరణ సభలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కాకినాడలో భారీగా కరోనా కిట్ల మాయాజాలం

Satyam NEWS

మత సామరస్యాన్ని ప్రతీక రంజాన్: మేడా బాబు

Satyam NEWS

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment