27.7 C
Hyderabad
April 20, 2024 00: 41 AM
Slider హైదరాబాద్

వృత్తి ధర్మం తప్పిన జర్నలిస్టుపై బహిష్కరణ వేటు

IJU

జర్నలిస్టు వృత్తిని, యూనియన్ పదవిని అడ్డుపెట్టుకొని ఖుత్బుల్లాపూర్ ప్రాంతంలో భూవివాదాల్లో తలదూరుస్తున్న రంగు వెంకటేష్ గౌడ్ ను బహిష్కరిస్తున్నట్లు టీయుడబ్ల్యుజె- ఐజేయు వెల్లడించింది. ఈ మేరకు టీయుడబ్ల్యుజె-ఐజేయు మేడ్చల్ జిల్లా కమిటీ నేడు ఒక ప్రకటన విడుదల చేసింది.

ఖుత్బుల్లాపూర్ ఏరియాలో 143 సంఘం నాయకుడిగా చెలామణి అవుతున్న రంగు వెంకటేష్ గౌడ్ సమాజం తిరస్కరించిన ఒక సూడో జర్నలిస్టుతో చేతులు కలిపి జర్నలిజం విలువలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పోరేటర్ టిక్కెట్టు కోసం యూనియన్ ప్రతిష్టను తాకట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో వెంటనే స్పందించి రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు అతనిని టీయుడబ్ల్యుజె- ఐజేయు నుండి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. సెటిల్మెంట్లు, పైరవీలతో అక్రమ డబ్బు సంపాదనకు ఎగబడ్డ వారు ఎవరూ జర్నలిజం ముసుగులో ఉండరాదనే ఆశయంతో ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటనలో టీయుడబ్ల్యుజె- ఐజేయు తెలిపింది.

Related posts

సమగ్ర శిక్ష ఉద్యోగులకు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ

Satyam NEWS

బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

ప్రధాని మోడీ స్వరాష్ట్రంలో 200 మంది పిల్లలు మృతి

Satyam NEWS

Leave a Comment