26.2 C
Hyderabad
February 14, 2025 01: 19 AM
Slider విశాఖపట్నం

సీనియర్ జర్నలిస్టు కృష్ణ శ్రీకు పరామర్శ

#journalist

గాజువాక ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు  కృష్ణశ్రీ ను మంగళవారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు పరామర్శించారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్న  కృష్ణశ్రీని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు శ్రీనుబాబు  ధైర్యం చెప్పడం జరిగింది. సీనియర్ పాత్రికేయుడిగా కృష్ణశ్రీ మూడు దశాబ్దాలకు పైగా వివిధ పత్రికల్లో పని చేశారని, 1999లో తనతో కలిసి  సూర్యప్రభ దినపత్రికలో పనిచేయడం జరిగింది అన్నారు.

అప్పటినుంచి కృష్ణ శ్రీతో  మంచి స్నేహం ఉన్నట్లు శ్రీనుబాబు చెప్పారు. ఈ సందర్భంగా యూనియన్లకు అతీతంగా తాను సొంతంగా 10000 ఆర్థిక సహాయం అందజేయడం జరిగిందని, అలాగే మరింత మంది మిత్రులు ముందుకు వచ్చి కృష్ణశ్రీకి అండగా నిలవాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలన్నదే తన ఉద్దేశం అన్నారు… ఇటీవల యాక్ట్ టీవీ ఈశ్వర్ మృతి చెందిన సమయం లో సొంతం గా 10000 చిరు సాయం అందించడం జరిగింది అన్నారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ అర్బన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాసరావు. గాజువాక కార్యదర్శి నాయుడు బాబు ఉపాధ్యక్షురాలు శిరీష. రాజశేఖర్ వెంకట్ రెడ్డి, తదితరులు అంతా పాల్గొన్నారు.

Related posts

కెమికల్ పాలు తయారు చేస్తున్న పవిత్ర డైరీ

Satyam NEWS

Coal and Sand scam: ఐఏఎస్ అధికారి ఇంట్లో బంగారం, వజ్రాలు

Satyam NEWS

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

Satyam NEWS

Leave a Comment