వారణాసికి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని పత్రికలకు ఆన్ లైన్ మీడియాకు వార్తలు రాసే రిజ్వానా తబస్సుమ్ తన గదిలో ఆత్మహత్య చేసుకోవడం ఆశ్చర్యం కలిగించింది. తన మరణానికి కారణం సమాజ్ వాది పార్టీ నాయకుడు షమీమ్ నోమానీ అని రిజ్వానా రాసిన లేఖ లభ్యం కావడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
28 ఏళ్ల రిజ్వానా, షమీమ్ లు చాలా కాలంగా స్నేహితులుగా ఉన్నారు. వారి మధ్య ఏం జరిగిందో అర్ధంకావడం లేదు. అకస్మాత్తుగా రిజ్వానా ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు గల కారణాల కోసం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారణాసిలోని హర్పల్ పూర్ లోని తన ఇంటిలోని గదిలో లోపల నుంచి గడియ వేసుకుని రిజ్వానా ఉరివేసుకున్నది.
పోలీసులు తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించి ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు పంపినట్లు పోలీసు పిఆర్ఓ సంజయ్ త్రిపాఠీ చెప్పారు.