26.2 C
Hyderabad
February 14, 2025 00: 15 AM
Slider సంపాదకీయం

జర్నలిస్టు సాయికి బుద్ధి వస్తుందా…??

#journalistsai

వైసీపీ పేటీఎమ్‌ స్టార్‌గా, బులుగు పార్టీ అనధికార కార్యకర్తగా, సాక్షి మీడియాకి, జగన్‌కి బాకా ఊదే జర్నలిస్టుగా ముద్రపడిన జర్నలిస్ట్ సాయి నాలుక మడతేశాడు.. గత అయిదేళ్లు, వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తన నోటికి ఇష్టం వచ్చినట్లు వీడియోలు చేసిన జర్నలిస్ట్ సాయికి… కూటమి ప్రభుత్వం పవర్‌లోకి రావడంతో కాస్త స్పృహ వచ్చింది.. అప్పటివరకు జగన్‌ తప్పు చేసినా ఆయన రైట్‌ అంటూ కూతలు కూసిన సాయికి తాజాగా మైక్‌ అడ్డం వస్తోంది.

జగన్‌ మూడు రాజధానులు, నాడు నేడు, వాలంటీర్‌ వ్యవస్థలు ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ అని వందల వీడియోలు చేసి.. పేటీఎమ్‌ స్టార్‌గా, నీలి జర్నలిస్టుగా ఇమేజ్‌ దక్కించుకున్న సాయి.. ఇప్పటికీ అదే భ్రమలో ఉన్నట్లు ఉన్నాడు.. ఏకంగా అధికారపక్షం చేయని అంశాలను సైతం ఆయనకు అవినీతిగా కనిపిస్తోంది. జగన్‌ సర్కార్‌ పాలనలో ఇసుక కుంభకోణం, లిక్కర్‌ మాఫియా, గనుల దొంగలపై నోరు మెదపని సాయి, కూటమి సర్కార్‌పై అవాకులు చెవాకులు పేలుస్తున్నాడు.. దావోస్ లో ఏటా జరిగే పెట్టుబడుల సదస్సుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హాజరవుతాయి.

అందులో భాగంగా ఏపీ తరఫున సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, ఇతర ఉన్నతాధికారులు దావోస్‌కి చేరుకున్నారు..  దావోస్ లో ఏపీ పెవిలియన్ ను ప్రచారం చేసేందుకు ఆయా మీడియా సంస్థలకు ప్రభుత్వం భారీ ఎత్తున అడ్వర్ టైజ్ మెంట్లను ఇస్తోంది. ఇదేమీ కొత్త పద్ధతి కాదు. ఇందులో భాగంగా ఎన్డీటీవీకి రూ.74 లక్షల విలువ చేసే యాడ్లను ప్రభుత్వం జారీ చేసింది. ఈ జీవోను ప్రస్తావించిన సాయి…రూ.74 లక్షలకు బదులుగా రూ.74 కోట్లు అని పలికారు.

ఆయా చానెల్స్‌కి చంద్రబాబు సర్కార్‌ అప్పనంగా ప్రభుత్వ ధనాన్ని కట్టబెడుతోందని, ఇదెక్కడ విడ్డూరం అంటూ వీడియోల వీడియోలు చేశారు. పేటీఎమ్‌ స్టార్ సాయి అబద్ధాలపై టీడీపీ సోషల్‌ మీడియా సీరియస్‌ అయింది.. ఇది ఫేక్‌ న్యూస్‌ అని ట్రోల్‌ చేసింది.. దావోస్‌ పర్యటన ప్రమోషన్స్‌ కోసం ప్రభుత్వం జారీ చేసింది కేవలం 74 లక్షలని వివరాలతో సహా వెలుగులోకి తీసుకువచ్చింది.. అంతే, సాయి తోక ముడిచాడు.. తాను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు…

పొరపాటు వెనక అసలు నిజం ఏంటో తెలిసి వచ్చిందో లేక, పేటీఎమ్‌ స్టార్‌గా, నీలి భజన జర్నలిస్ట్‌గా ముద్ర పడిందని… ప్రజలకు తెలిసిందని భయపడ్డాడో తెలియదు కానీ, సారీ.. క్షమించండి అంటూ ఓ వీడియో చేశాడు.. తాను పొరపడ్డానని, ఇది కేవలం తన తప్పుగా గ్రహించాలని ఓ వీడియో చేశాడు. అయితే, సాయి ఆ వీడియోని కేవలం ప్రజలని తప్పు దోవ పట్టించడానికే చేశాడని ఆరోపిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.. సాయి.. వైసీపీ భజనలో, వైసీపీ అకౌంట్లలో మునిగి తేలుతున్నాడని, వారి నుండి భారీగా అందుతోన్న ప్యాకేజ్‌ కోసం, జగన్‌, సజ్జలని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఇలాంటి ప్రభుత్వ చర్యలకు పాల్పడుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు రాజకీయ పరిశీలకులు.

ఏది ఏమైనా, సాయికి గడ్డిపెట్టడంతో కాస్త తెలివి వచ్చిందని, ఇకపై బుద్ధి వస్తే బెటర్‌ అని లేదంటే, ఆయనకు సరైన సమాధానం సోషల్‌ మీడియా వేదికగా చెబుతామని వార్నింగ్‌ ఇస్తున్నారు టీడీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలు.. మరి, బులుగు ముద్ర పడిన సాయిలో మార్పు వస్తుందా..?? రాదా..?? అనేది చూడాలి..

Related posts

కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డికి షాక్?

Satyam NEWS

డిజే మోగితే యజమానులపై కేసు

Satyam NEWS

తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతల స్వీకరణ

Satyam NEWS

Leave a Comment