24.7 C
Hyderabad
July 18, 2024 06: 52 AM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంశాలు

జర్నలిస్టుగా నువ్వు మాతో ఉండాలి సురేష్

pjimage (9)

జర్నలిస్టు అంటే ఒక బ్లాక్ మెయిలర్ అనో, ప్రెస్ నోట్లకు డబ్బులు తీసుకునేవాడు అనో చాలా మంది అనుకుంటారు. నీతిగా నిజాయితీగా బతికే జర్నలిస్టులు ఉన్నారు అంటే చాలా మంది నమ్మడం కూడా లేదు. ఒకరో ఇద్దరో కోట్లకు పడగలెత్తిన వారిని చూసి జర్నలిస్టులంతా అలానే ఉంటారునుకుంటే అది పొరబాటే. సుమారుగా 20 సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పని చేస్తూ కటిక పేదరికంలో బతుకుతున్న జర్నలిస్టు సురేష్ కుమార్. చాలీ చాలని జీతంతో, జీతం ఇవ్వని యాజమాన్యాలతో పోరాడి పోరాడి అలసి పోయిన సురేష్ కుమార్ ఇప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టాడు. ముగ్గురు పిల్లలతో రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న సురేష్ కు అకస్మాత్తుగా లివర్ సిరోసిస్ వచ్చింది. ఏం చేయాలి? ఎవరు ఆదుకోవాలి? పేరుకు పెద్ద జర్నలిస్టు. రిపోర్టర్ గా 10సంవత్సరాలు ఈనాడులో పని చేశాడు. 1 సంవత్సరం ఆంధ్ర ప్రభలో స్టాఫర్ గా వృత్తిధర్మం నిర్వహించాడు. 2సంవత్సరాలు సూర్యలో స్టాఫర్ గా పని చేశాడు. ప్రస్తుతం మన తెలంగాణ లో స్టాఫర్ గా చేస్తూ రెండు నెలల క్రితం కాలు వాచిందని డాక్టర్ కు చూపించేందుకు వెళ్లాడు. అప్పుడు తెలిసింది అది సాధారణమైన అనారోగ్యం కాదు, కాలేయ సంబంధిత వ్యాధి అని. దాంతో ఆ పేరుమోసిన ప్రయివేటు ఆసుపత్రి అతను బిల్లు కట్టలేడని తెలుసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. ఏం చేయాలో తెలియన సురేష్ నిమ్స్ కు వెళ్లాడు. అన్ని టెస్టులూ చేసి లివర్ సిరోసిస్ గా తేల్చారు. లివర్ కు సంబంధించిన వ్యాధి అనగానే జర్నలిస్టు కదా రోజూ తాగుతాడు అనుకుంటారు అందరూ. తాగడం వల్లే లివర్ పాడైపోయిందని అంటుంటారు. అయితే సురేష్ కు అలాంటి అలవాట్లు లేవు. అయినా లివర్ పాడైపోయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి  ఏమి బాలేదు. ఇంట్లో తిండికి, మందులకు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 1 నెల రోజుల పాటు హెల్త్ కార్డు ద్వారానే చికిత్స చేయించుకున్నాడు. లాభం లేకపోయింది. లీవర్ మార్చాలని డాక్టర్లు చెప్పారట. దాదాపుగా 15 లక్షలు ఖర్చు అవుతుంది. ఏం చేయాలి? రోజూ వారీ ఖర్చులకే లేదు. జర్నలిస్టుగా పైరవీలు చేసి సంపాదించలేదు. నిజాయతీగా బతికాడు. ఏం చేయాలి? అందుకే మీకు వీలైతే సహాయం చేయాలనుకుంటే 7095970003 నెంబర్ కి గూగుల్ పే చేయండి. నిజాయితీగా బతికే ఓ చిరు జర్నలిస్టు ను కాపాడుకుందాం.    

Related posts

ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఆసక్తి రేకెత్తిస్తున్న మోడీ యూరప్ టూర్

Satyam NEWS

శివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

Satyam NEWS

మీ ఎం.ఎల్.ఏ లు ఎంత తింటున్నారో చెప్పాలా?

Satyam NEWS

Leave a Comment