39.2 C
Hyderabad
March 29, 2024 16: 32 PM
Slider నెల్లూరు

ఆన్ లైన్ సెంటర్ల వద్ద జర్నలిస్టుల అగచాట్లు

185981-perni-nani

హైటెక్ బాటలో వెళుతున్న ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ జర్నలిస్టులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. ఈ ఏడాది నుంచి జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కార్డు (ఎక్రిడిటేషన్ కార్డు) పొందేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అందుకు అనుగుణంగానే జర్నలిస్టులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే సర్వర్ బీజి అంటూ వెబ్ సైట్ ఓపెన్ కావడం లేదు. ఈ నెల 23న అక్రిడేషన్ చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించడంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకునేందుకు జర్నలిస్టులు ఆన్లైన్ సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. దీంతో ఐపీఆర్ వెబ్ సైట్ కు సంబంధించి సర్వర్ బిజీ అయ్యంది.

వెబ్ సైట్  ఓపెన్ అవడం లేదు. జిల్లాలోని పలువురు గ్రామీణ జర్నలిస్టులు దరఖాస్తు కోసం నెల్లూరు నగరానికి చేరుకుని నెట్ సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ బిజీగా ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు. మరో మూడు రోజులు గడువు పొడించ వలసిందగా పలువురు జర్నలిస్టులు కోరుతున్నారు.

Related posts

తండాల్లో నాటు సారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసు దాడులు

Satyam NEWS

భారత్ ను తీవ్రంగా హెచ్చరించిన పాకిస్తాన్

Satyam NEWS

గిరి శిఖర గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్

Satyam NEWS

Leave a Comment