37.2 C
Hyderabad
March 28, 2024 18: 26 PM
Slider ఆదిలాబాద్

మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కి జర్నలిస్టుల వినతిపత్రం

adb journalists

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే( ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రెహమాన్ కోరారు. జర్నలిస్ట్ మలిదశ ఉద్యమంలో భాగంగా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కు, జడ్పీ చైర్మన్ లు కోవ లక్ష్మి, జనార్దన్ నాయక్ లను వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పలు సందర్భాల్లో  జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. 

అన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు ఈ జి హెచ్ ఎస్ పథకం ద్వారా జారీ చేసిన హెల్త్ కార్డు ఒకటి రెండు ఆసుపత్రుల మినహా ఎక్కడా కూడా హెల్త్ కార్డులు లేకపోవడంతో జర్నలిస్టు ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

అప్పులు చేసుకొని వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని ఆస్పత్రుల్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జర్నలిస్టుల న్యాయమైన సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సంపత్ కుమార్, జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్, టీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణంరాజు, పాత్రికేయులు సురేష్ చారి,  రాందాస్, సయ్యద్ సోజర్, మిలీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా న్యూస్: క్లారిటీ ఇచ్చిన సత్యం న్యూస్

Satyam NEWS

మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలను పంపిణి చేసిన ఎన్.వై.కే…!

Satyam NEWS

ఏలూరుకు రానున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి

Satyam NEWS

Leave a Comment